మనం సాధారణంగా పొన్నగంటి ఆకులతో పప్పు, కూర వంటలు చేసుకుని తింటుంటాం. కానీ చాలా మందికి దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలియవు. ఎప్పుడూ కూడా ఆకుకూరల్లో చాలా పోషక విలువలు వుంటాయి. అలానే పొన్నగంటి కూరలో కూడా అనేక పోషకాలు ఉన్నాయి.
పొన్నగంటి కూర తినడం వల్ల కలిగే ఉపయోగాలు..
పొన్నగంటి కూరని తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నిజంగా జీర్ణక్రియని మెరుగుపరచడానికి ఇది ఔషధంలా పని చేస్తుంది. ఆయుర్వేద ఔషధాలలో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది. దీన్ని ఇళ్ళల్లో చిన్న చిన్న కుండీలలో వేసి పెంచుకుంటే ఎంతో సులువుగా పెరుగుతుంది.
ఇవి ఏడాది పొడువునా కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది నిజంగా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ చాల తక్కువగా ఉంటుంది. అలాగే తరచు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా మెరుగు పడుతుంది. అంతే కాదు పొన్నగంటి కూరలో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయి. పైగా గుండె సమస్యలు కూడా అదుపు చేస్తాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా ఇది సహాయపడుతుంది. పొన్నగంటి ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆస్తామా, బ్రాంకైటిస్ తగ్గుతుంది. ఎముకల ఎదుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. దీనిలో కాల్షియం ఆస్టియోపొరోసిస్ వంటి వాటిని కూడా దూరం చేస్తుంది. మూత్రపిండ సమస్యలతో భాదపడే వాళ్ళు వైద్యుల సలహా తోనే తీసుకోవాలి గుర్తుంచుకోండి.