సాధారణంగా ఇండియాలో వంటింట్లో ముఖ్యమైన ఆహారపదార్థం ఉల్లిపాయ. వీటిని ఉపయోగించకుండా చేసుకునే వంటలు చాలా అరుదు. ముఖ్యంగా మిర్చీ, బజ్జీలాంటి స్కాక్ ఐటమ్స్ తోపాటు, నాన్ వెజ్ వంటకాల్లో కూడా ఉల్లి ముఖ్యంగా వాడుతుంటాం. అయితే ఉల్లిపాయాలను తినడం వలన చాలా ప్రయోజనాలున్నాయి.
రోజూ ఉల్లిపాయ తినడం వలన అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సతో పాటు నివారణకు కూడా ఇవి సహాయపడతాయి. అంతేకాదు ఇవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, ఉబ్బసం వంటి వ్యాధులను నివారించగలవని నిపుణులు చెబుతున్నారు. ఈవే కాకుండా ఉల్లిపాయలకు క్యాన్సర్ వ్యాధిని నివారించే గుణం ఉంటుందని. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ క్వేర్సెటిన్ పెద్ద మొత్తంలో ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఉల్లిపాయలను రోజూ తీసుకోవడం వలన క్వెర్సేటిన్ క్యాన్సర్ వ్యాప్తిని నివారించి జీర్ణశయాంతర ప్రేగు అభివృద్దిని నివారించడానికి యాంటీ ఆక్సిడెంట్ బాగా పనిచేస్తుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.
సెల్యులార్ జీవక్రియలోని రసాయన ఉపఉత్పత్తులు ఆరోగ్యకరమైన కణాలను క్యాన్సర్ కణాలుగా మార్చగల సామర్ధ్యం ఉంటాయి. వాటిని నాశనం చేసే శక్తి ఉల్లిపాయలకు ఉంటుంది. అయితే ఉల్లిపాయలు పూర్తిగా క్యాన్సర్ ను నివారించలేవు. కానీ చికిత్సతో పాటు నివారణలో ఇవి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కనుక సాధ్యమైనంత వరకు ఉల్లిపాయలను ప్రతి వంటకంలో ఉండేలా చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.