వార్తలు

ఇంగువ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0
  • ఇంగువను తాలింపులో ఎక్కువగా వాడుతారు. ఇంగువ వాడడం వల్ల మంచి వాసన రావడమేకాకుండా, రుచిగా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంగువలో శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా ఎన్నో వున్నాయి.
  • ఇంగువలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. గర్భనిరోధకంగా కూడా దీన్ని వాడతారు. రుతు సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువను వాడుతారు.
  • అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు కూరల్లో కొంచెం ఇంగువను వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. గ్లాసు నీళ్ళల్లో కానీ, మజ్జిగలో కానీ కలుపుకొని తాగడం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
  • జలుబు, దగ్గు శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్న వాళ్ళు ఒక స్పూన్ తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం మొక్కలతో కలిపి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అదుపులోకి వస్తాయి.
  • గ్యాస్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేయడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
  • రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో అధికంగా ఉన్నాయి. కాబట్టి రక్తపోటు ఉన్న వాళ్ళు ఆహారంలో ఇంగువను చేర్చుకోవాలి.
  • ఇంగువను తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం తక్కువ. అంతేకాకుండా నెలసరి సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
  • ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఇంగువను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్తమా సమస్య అదుపులోకి వస్తుంది.
  • మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికర హార్మోన్ల తో పోరాడే శక్తి ఇంగువకు ఉంది.
Leave Your Comments

యువతరం … ఆధునిక సేద్యం

Previous article

110 రకాల స్వదేశీ వరి వంగడాలను సాగు చేసిన కార్పొరేట్ ఉద్యోగి.. భాస్కర్

Next article

You may also like