హర్యానా రైతులకి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులకు సంబంధించిన అన్ని వివాదాలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో వ్యవసాయ కోర్టులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. . వ్యవసాయ కోర్టులు ప్రారంభించిన తర్వాత, చెల్లింపులో జాప్యం, పరిహారం చెల్లించకపోవడం మరియు పంట బీమా కంపెనీల ఏకపక్షంగా వ్యవహరించడం వంటి అన్ని రకాల వివాదాలను సదరు కోర్టులో సవాలు చేయవచ్చు. వ్యవసాయ కోర్టులు ప్రారంభించిన తర్వాత రైతులకు సంబంధించిన వివాదాలు త్వరితగతిన పరిష్కారమవుతాయని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది.
అక్టోబర్ 27తో బీజేపీ ప్రభుత్వం ఏడేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ ఏడేళ్లలో హర్యానా ప్రభుత్వ మంత్రులు ఏడు ప్రధాన పథకాలతో రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద 132 పనులకు సంబంధించి పెద్ద జాబితా ఉన్నప్పటికీ, నేరుగా ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన నిర్ణయాలపైనే చర్చ జరగనుంది. ఈ విధానం హర్యానా రైతులకి ఎంతో ఉపయోగపడనుంది.
ఈ మేరకు ఎన్‌సిఆర్, సెంట్రల్ హర్యానా మరియు ఉత్తర హర్యానా ప్రజల ప్రయోజనం కోసం సంక్షేమ పథకాలపై ప్రాంతాల వారీగా చర్చ జరుగుతుంది. ప్రస్తుతం, అత్యంత ముఖ్యమైన అంశం రైతులు మరియు వ్యవసాయ ప్రయోజనాలకు సంబంధించినది. ఈ నేపథ్యంలో రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ఆ రాష్ట్ర పని చేస్తుంది. అయితే ఈ అగ్రికల్చర్ కోర్టుల బాధ్యతలను ఐఏఎస్ అధికారులకు అప్పగించాలా లేక హెచ్‌సీఎస్ లేదా వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించాలా.. అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.
#haryanafarmers #specialcourts #agriculturelatestnews #eruvaakadailyupdates