Government Aim Is to Ensure MSP to All Crops రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు పని చేయాలనీ, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే సహించబోయేదే లేదన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి. ఈ మేరకు వ్యవసాయ సంబంధిత అధికారులతో ఎర్పాటు చేసిన భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ CM YS Jagan మాట్లాడారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి రైతన్నకు కచ్చితంగా కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ధాన్యం కొనుగోళ్లలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడాలని, ప్రతి రైతు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అన్న వైఎస్ జగన్, ఆ దిశగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, అధికారులు ముఖ్య పాత్ర వహించాలన్నారు. ఇక ధాన్యం సేకరణలో ఆర్బికేల పాత్ర క్రియాశీలకంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
AP Paddy Procurement ధాన్యాన్ని సేకరించిన 21 రోజుల్లో రైతులు ఖాతాల్లో డబ్బు జమ అవ్వాలి. ఇక రంగు మారిన ధాన్యాన్ని కూడా సేకరించాలని, రంగు మారిన ధాన్యాన్ని సేకరించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అభిప్రాయ పడ్డారు ముఖ్యమంత్రి. ఇక ధాన్యం కొనుగోలు సమయంలో కూలీల కొరత, హమాలీల ఖర్చుల భారం, రవాణా, గొనె సంచుల ప్రక్రియ ఇవేం రైతుకు భారం కాకూడదని అధికారులకు సీఎం సూచించారు. ఇక రైతులతో అధికారులు ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలన్న సీఎం, రైతు సమస్యల రీత్యా ప్రత్యేక ఫోన్ నంబర్ ని ఎర్పాటు చేయాలన్నారు. ఇక ధాన్యం సేకరణలో మిల్లర్ల పాత్ర లేకుండా చేశామని, ధాన్యం సేకరించిన తర్వాతే మిల్లర్ల పాత్ర ఉంటుందని సీఎం చెప్పారు. కాగా ధాన్యాన్ని విదేశాలకు తరలింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వమే విదేశాలకు తరలించాలని, ఇలా చేయడం వల్ల రైతులు ప్రయోజనం పొందుతారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. RBK Cnetres
MSP to All Crops అంతేకాకుండా ధాన్యం సేకరించే సమయంలో ప్రతి ఆర్బికే కేంద్రాల్లో కనీసం ఐదుగురు సిబ్బందిని నియమించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ధాన్యం సేకరణ, ఆ విషయంలో రైతుల సమస్యలు, హమాలీలు, గొనె సంచుల, రవాణా వాహనాల ఎర్పాటు అంతా ఆ ఐదుగురు సిబ్బంది చూడాలని సీఎం సూచించారు. ఇక టెక్నీకాల్ పరంగా, డేటా ఎంట్రీ తదితర విషయాల్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలి. కాగా.. ఫిర్యాదుల కోసం ఎర్పాటు చేసిన ఆ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలి. క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి రైతులు చెప్పే సమస్యలను వినాలి. దీనివల్ల సమస్య తీవ్రత తెలియడంతోపాటు పరిష్కార మార్గాలు లభిస్తాయి. రైతులతో అధికారులు నిరంతరం సంప్రదించాలి. జేసీల నుంచి కూడా పంటల కొనుగోలుపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎర్పాటు చేసిన భేటీలో సీఎం వైఎస్ జగన్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు.