సాధారణంగా కొబ్బరి చెట్టుకు 200 నుంచి300 కాయలు కాస్తాయి. కాని రాజంపేట లోని ఓ కొబ్బరి చెట్టు మాత్రం ఖర్జూరపు చెట్టును తలపిస్తోంది. పట్టణంలోని బలిజపల్లి మార్గంలో నివసిస్తున్న గోపాలకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాటశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంటి పెరట్లో నాలుగేళ్ల క్రితం రెండు కొబ్బరి మొక్కలు నాటారు. వాటిలో ఒక దానికి ఇప్పుడు కాయలు విరగ్గాశాయి. 700లకు పైగా కాయలతో ఈ చెట్టు విస్తుగొలుపుతోంది.”జన్యు లోపం వల్లగాని పరాగ సంపర్కం అధికంగా జరగడం వల్ల ఎక్కువ కాయలు కాశాయి. సాధారణంగా పిందె దశలోనే రాలిపోతుంటాయి.
Leave Your Comments