Gadchiroli Agarabatthi Project: గడ్చిరోలి మహారాష్ట్రలో తూర్పున ఉన్న జిల్లా,దీని మొత్తం వైశాల్యం 1,491,554 హెక్టార్లు అందులో 1,133,009 హెక్టార్లు అనగా 76% భూభాగం దట్టమైన అడవులతో కప్పబడి ఉంది. అడవుల్లో జీవవైవిధ్యం గొప్పగా ఉన్నప్పటికీ, ఉపాధి అవకాశాలు సరిగ్గా లేనందున అక్కడ ప్రజలు ఉపాధి కోసం నానా ఇబ్బందులు పడుతుంటారు. జిల్లాలో అతిపెద్ద ఉద్యోగ నియామక సంస్థ అటవీ శాఖ. అయినప్పటికీ, ఇవి వివిధ రకాలైన రోజువారీ కూలీ పనులు మాత్రమే ఇవ్వగలిగేది. వామపక్ష తీవ్రవాదానికి ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాంతంగా ట్యాగ్ చేయబడటం అక్క ప్రజలలో వణుకు పుట్టించింది.
అక్కడ ప్రజలు ఏదైనా కొత్త సామాజిక, వ్యవస్థాపక ప్రయోగాలు ఏర్పాటు చేయడానికి హింస నిరుత్సాహపరిచింది. ఆ ప్రాంతంలో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టె సాహసం చేయలేదు, పెడదాం అన్న కూడా జిల్లాలో 76% కవర్ చేసిన అడవులు. వ్యవసాయం ద్వారా జీవనోపాధి పొందే అవకాశాలు చాలా పరిమితంగా ఉంటాయి మరియు వర్షపాతం యొక్క మార్పులు వ్యవసాయాన్ని దుర్భరం చేస్తున్నాయి.వీరి జీవితంలో ఉపాధి వనరులలో ఒకటి టెండు ఆకుల(బీడీ ఆకులు),మహువ పువ్వుల సేకరణ మరియు అమ్మకం, రెండవది అటవీ శాఖ ద్వారా రోజువారీ కూలీ పనులు.
ఈ నేపథ్యంలోనే ది గడ్చిరోలి అగర్బత్తి ప్రాజెక్ట్ (GAP) రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ విదేశీ ఎగుమతుల ద్వారా జీవనోపాధిని లక్ష్యంగా చేసుకుంది. GAP ప్రస్తుతం అగర్బత్తి ఉత్పత్తి కేంద్రాలుగా పని చేస్తున్న 32 కేంద్రాలను కలిగి ఉంది.
దీనిలో సుమారు 1100 మంది స్వయం ఉపాధి పొందుతున్నారు. వీరిలో దాదాపు 90% మంది మహిళలు. ప్రతి కేంద్రంలో 10 నుంచి 12 అగర్బత్తీ తయారీ యంత్రాలు ఉన్నాయి. ప్రతి మహిళ ప్రతి కిలోగ్రాము అగర్బత్తికి తయారీకి 10 రూపాయలు సంపాదిస్తుంది అనగా, నెలకు సుమారు రూ. 5000 వరకు సంపాదిస్తున్నారు.
మే 2012లో అగర్బత్తి ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుతో ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. మే మరియు జూన్ 2012 మధ్య,గడ్చిరోలి జిల్లా అటవీ డివిజన్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఐదు కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. నవంబర్ 2012 నాటికి, మరో రెండు కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. ప్రస్తుతం 32 కేంద్రాలలో ఉంది. జిల్లా వ్యాప్తంగా కేంద్రాలు పూర్తిగా పని చేస్తున్నాయి.