Omicron Effect: కరోనా మరో రూపం ఓమిక్రాన్ కేసుల పెరుగుదల కారణంగా దేశంలో దిగుమతి చేసుకున్న పండ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని తాజా పండ్ల దిగుమతి దారులు తమ గిడ్డంగులను పెంచుకుంటున్నారు. ప్రముఖ తాజా పండ్ల దిగుమతి దారు ఐజి ఇంటర్నేషనల్‌లో ఫైనాన్స్ మరియు కార్యకలాపాల డైరెక్టర్ తరుణ్ అరోరా మాట్లాడుతూ.. ప్రపంచీకరణ ఆర్థిక వ్యవస్థలో గిడ్డంగులు మరియు లాజిస్టిక్‌లు కీలకమైనవి. అంతేకాకుండా అవి వ్యాపార వృద్ధిలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు తరుణ్ అరోరా. తాజా పండ్లు ఎక్కువగా పాడైపోయే అవకాశం ఉన్నందున కోల్డ్ స్టోరేజీలు మా వ్యాపారానికి జీవనాధారమని, మా యొక్క గొప్ప విజయాలలో ఒకటి భారతదేశంలో తాజా పండ్ల యొక్క బలమైన పంపిణీ నెట్‌వర్క్‌ను నిర్మించడమని చెప్పారాయన.
కోవిడ్ నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషక లక్షణాలున్న ఆహార పదార్ధాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో దిగుమతి చేసుకున్న పండ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇదే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలి, పెరుగుతున్న ఆదాయాలు వంటి ఇతర అంశాలు కూడా పెరుగుతున్న డిమాండ్‌కు గణనీయంగా దోహదపడుతున్నాయని అరోరా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మా సంస్థ గిడ్డంగులకు ఢిల్లీలో 6,40,000 క్యూబిక్ అడుగుల శీతల స్థలాన్నిఏర్పాటు చేశామని చెప్పారు. కస్టమర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారి ఆకాంక్షను తీర్చడానికి భారతదేశం అంతటా మా సరఫరా కొనసాగుతుందని అరోరా తెలిపారు.
Also Read: వ్యవసాయం లో ఏ.పి. టాప్- కన్నబాబు
కాగా.. కరోనా కారణంగా జనాల్లో ఆరోగ్యం పట్ల స్పృహ బాగా పెరిగింది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దా చిన్నా అంతా పండ్లు తీసుకుంటున్నారు. ఇలా ఇటీవల పండ్ల కొనుగోలు బాగా పెరిగిపోయింది.
Also Read: రైతుబంధు జాప్యం.. కారణమిదే