Fifth International Agronomy Congress ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి సంయుక్తంగా నిర్వహిస్తున్న 5వ అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ నాలుగవ రోజు రాజేంద్రనగర్‌లోని పికెటిఎన్ఏయు ఆడిటోరియంలో కొనసాగింది. తెలంగాణ నలుమూలల నుండి వచ్చిన రైతులతో శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించారు. అనేక అంశాలపై రైతులకి అవగాహన కల్పించారు. అదేవిధంగా రైతులు ఎగ్జిబిషన్న సందర్శించారు. నూతన ఆవిష్కరణల్ని ఆసక్తిగా పరిశీలించారు. Fifth International Agronomy Congress 4th Day
ఈ రోజు జరిగిన సెషన్లో ఐసిఏఆర్ డిడిజి అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ డాక్టర్ ఏకె.సింగ్, జర్మనీ శాస్త్రవేత్త గిరాల్డ్ రెహమాన్, మెక్సికో శాస్త్రవేత్త డాక్టర్ బ్రామ్ గోవర్డ్స్ తదితరులు ప్రసంగించారు. సుమారు 1.3 బిలియన్ పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని అది మన ముందున్న పెద్ద సవాల్ అని ఏకె.సింగ్ అన్నారు. 2050 నాటికి పూర్తిస్థాయిలో ఆహారభద్రత సాధించవలసిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఈ రోజు జరిగిన సదస్సులో పికెటిఎన్జీయు ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్ రావు, పరిశోదనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్ సహా పెద్దసంఖ్యలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అలాగే 4వ రోజు వివిధ ఎగ్జిబిషన్ స్టాళ్లకు అవార్డులు అందజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టాల్‌కు ఉత్తమ స్టాలు అవార్డు లభించింది. డా. వేణుగోపాల్ రెడ్డి అవార్డు అందుకున్నారు. భారతీయ వ్యవసాయ పరిశోదనామండలి ఎడిజి డా. ఎస్.భాస్కర్ అవార్డును అందజేశారు. ఉపకులపతి డా. వి.ప్రవీణ్ రావు, డా. వి.కె.సింగ్ కూడా పాల్గొన్నారు. Eruvaaka