వార్తలు

పంటలు సాగు చేయడంలో సరికొత్త వైవిధ్యాన్ని చాటుతున్న రైతులు..

0

గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసులు పంటలు సాగు చేయడంలో వైవిధ్యాన్ని చాటుతున్నారు. ఎడారిలో పాండే ఖర్జూరం, ప్రత్యేక ప్రాంతాల్లో సాగయ్యే యాపిల్ వంటి పంటల్ని జిల్లాలో సాగు చేస్తూ ప్రత్యేకత చాటుతున్నారు. తనకున్న మూడెకరాల్లో ఏటా వరి సాగు చేసేవారు. ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో ఉద్యానవన పంటలను సాగు చేయాలని అనుకున్నారు. ముందుగా జామ, సీతాఫలం తోటలు వేశారు. వాటితో పాటు ఖర్జూర పంట గురించి తెలుసుకున్నారు. అనంతపురంలో సాగుచేసిన పంటను పరిశీలించి అక్కడి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. అది లాభదాయకమని భావించి ప్రయోగాత్మకంగా పంట సాగు చేశారు.
రాజస్థాన్ నుంచి గతేడాది అక్టోబర్ లో ఖర్జూర మొక్కలను తెప్పించి ఒక ఎకరంలో నాటారు. బర్హి రకానికి చెందిన ఒక్కో మొక్కకు, ఏడు మగ మొక్కలు నాటినట్లు రైతు తెలిపారు. మగ మొక్కలకు వచ్చే పుప్పొడిని ఆడ మొక్కలకు చల్లాల్సి ఉంటుందన్నారు. ఈ ఏడాది కొన్ని చెట్లకు చెట్లకు కాయలు కాశాయని వివరించారు. వాటి కొనుగోళ్లకు మాత్రమే డబ్బులు ఖర్చు చేశారు. సాగుకు పూర్తిగా సేంద్రియ పద్ధతులనే పాటిస్తున్నట్లు చెప్పారు. ఒక చెట్టుకు ఒక ఏడాదికి దాదాపు రూ. 400 వరకు అమ్ముకోవచ్చన్నారు. ఈ పంటలో అంతరపంటగా గత ఏడాది వేరుశనగ సాగుచేయగా ఈ ఏడాది మినుము వేసినట్లు తెలిపారు. కేవలం శీతల ప్రాంతంలో మాత్రమే పండించే యాపిల్ పంట సాగును ప్రయోగాత్మకంగా చేపట్టారు రైతు శ్రీనివాసులు. వంద మొక్కలు తెప్పించి నాటారు. మొక్కలన్నీ ఏపుగా పెరుగుతున్నట్లు చెప్పారు.

Leave Your Comments

బంతిపూల సాగుతో అధిక లాభాలు గడిస్తున్న యువరైతు..

Previous article

వరి కోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

Next article

You may also like