వార్తలు

రైతు పారిశ్రామికవేత్త కుసుమ ఎందరికో ఆదర్శం…

0
Farmer entrepreneur Kusuma Inspirational Story
Farmer entrepreneur Kusuma Inspirational Story

( Inspiring Farmer )సేంద్రీయ వ్యవసాయం అనేది ఒక జీవన విధానం, కేవలం లాభనష్టాలపై దృష్టి సారించే ఆర్థిక కార్యకలాపం కాదు. కానీ వ్యవసాయ జీవితం కనిపించేంత సులభం కాదని చెప్తున్నారు కుసుమ. ఉత్తర కన్నడ జిల్లాలోని దేవిమనేకు చెందిన రైతు, పారిశ్రామికవేత్త కుసుమ సహజ చేతి పనులు చేస్తూ ఎంతో ఆదర్శంగా నిలిచారు. ఎంచుకున్న రంగం సాగుబడి అయినప్పటికీ రైతుకు కేవలం వ్యవసామే కాదు దానికి అనుసానందంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. అప్పుడే లాభదాయకంగా ఉంటుందని చెప్పారు ఆమె. ఈమె సేంద్రియ వ్యవసాయం మరియు చేతి పనుల్లో మంచి నైపుణ్యం సాధించారు.

( Kusuma Made Hand Crafts )కుసుమ మరియు ఆమె భర్త బాలచంద్ర ఉత్తర కన్నడ జిల్లాలోని సిద్ధాపుర తాలూకాలోని దేవిమనే గ్రామంలో నివసించేవారు. ఆ ఊర్లో వారికి ఉన్న ఎనిమిది ఎకరాల భూమిలో తోటను పండిస్తున్నారు. కుసుమ వ్యవసాయానికి విలువను జోడించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. ఆమె ఆభరణాలు మరియు ఇతర సేంద్రీయ ఉత్పత్తులు అదేవిధంగా ఆమె రుద్రాక్షిలు, బాణపు పిండి, కోకుమ్ గింజల నుండి తీసిన నెయ్యి, వివిధ రకాల నెక్లెస్‌లు, కీ చైన్లు తయారు చేస్తుంది.

Farmer entrepreneur Kusuma Inspirational Story

Farmer entrepreneur Kusuma Inspirational Story

వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కుసుమ వ్యవసాయంపై ప్రేమ మరియు పర్యావరణం పట్ల శ్రద్ధతో తన తండ్రి వారసత్వం తీసుకుని అరుదైన మొక్కల రకాలను సేకరించి అభివృద్ధి చేస్తుంది. తన భర్త బాలచంద్రతో కలిసి కుసుమ వ్యవసాయం చేసి 15 ఏళ్లు అవుతోంది. కొన్నేళ్లుగా, కుసుమ సబ్బు తయారీ, హెయిర్ ఆయిల్, టూత్ పౌడర్, కోకుమ్ స్క్వాష్, కోకుమ్ నెయ్యి తయారు చేశారు. అంతేకాకుండా ఆమె మరింత అవగాహన కోసం ఆన్లైన్లో శిక్షణ పొందడమే కాకుండా ఇతర మహిళలకు శిక్షణ ఇచ్చేవారు. తమ పొలంలో బర్మా వెదురు పుష్కలంగా పెరుగుతాయని చెప్తున్నారామె.వాటికి సృజనాత్మకత జోడించి వెదురు చెవిపోగులు, పెన్ స్టాలు తయారు చేసేవారు.

( Entreprenur Kusuma )అయితే కరోనా సమయంలో మార్కెట్ గురించి ఆమె తీవ్రంగా ఆందోళన చెందారట. కానీ బెంగళూరులోని మహిళల మార్కెట్ ఆమెకు ఆశాకిరణాన్ని అందించింది. ఇతర కొత్త ఉత్పత్తులు, కోకుమ్ బటర్ బామ్, యారోరూట్ పౌడర్, జాక్‌ఫ్రూట్ గుజ్జు, పచ్చి అరటిపండు పొడి, రుద్రాక్షతో చేసిన రాఖీలు మరియు విత్తనాలు కూడా ఆమె పనిలో భాగమయ్యాయి. యువత వ్యవసాయంపై ఆసక్తి కోల్పోతున్న తరుణంలో కుసుమ లాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలిచారు..నిలుస్తున్నారు కూడా.

#FarmerentrepreneurKusuma #InspirationalStory #farmerinspiringstroy #agriculture #eruvaaka

Leave Your Comments

గణనీయంగా పెరిగిన టీ ఉత్పత్తి…

Previous article

విద్యాసాగర్‌రావుకు నివాళులర్పించిన మంత్రి…

Next article

You may also like