వార్తలు

ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల ఆర్తనాదాలు…

0
chilli mirchi farmers

Chilli farmers demand rs 1 lakh per acre in damages ఖమ్మం జిల్లాలో మిర్చి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. దాదాపుగా 70 నుంచి 80 వేల ఎకరాల్లో తెగుళ్ల కారణంగా మిర్చి నాశనం అయింది. ఈ మేరకు తమను ఆదుకుని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు . వివరాలలోకి వెళితే…

chilli mirchi farmers

Chilli Crop Damges ఈ ఏడాది ఖమ్మం జిల్లాలో దాదాపుగా 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి పంట సాగు అయింది. అయితే అందులో ఒక లక్ష ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో 70 నుంచి 80 వేల ఎకరాల్లో మిర్చి పంట పూర్తిగా వైరస్, తామర పురగులతో నాశనం అయింది. అయితే నష్టపోయిన పంటను ప్రకృతి విపత్తుగా పరిగణించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఖమ్మం జిల్లా రైతులు డిమాండ్ చేస్తూ.. ఖమ్మం జిల్లా వైరాలోని వ్యవసాయశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీఏ) కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

chilli mirchi farmers

మిర్చి పంటలకు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం పంట నష్టం అంచనా వేయట్లేదని మండిపడ్డారు. రైతుసంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొంతు రాంబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని ధ్వజమెత్తారు. తెగుళ్ల కారణంగా నష్టపోయిన పంటను ప్రకృతి విపత్తుగా పరిగణలోకి తీసుకుని ఎకరాకు లక్ష రూపాయలు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. Khammam Chilli Farmers

Leave Your Comments

రాష్ట్రంలో 42 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ

Previous article

వ్యవసాయంలో మరింత అభివృద్ధి దిశగా ఏపీ

Next article

You may also like