వార్తలు

వ్యవసాయంపై కేంద్రం కీలక నిర్ణయం

0
Centre accepts farmers demand

Farmers Demand: ఇటీవలే కేంద్రం వివాదాస్పద మూడు సాగు చట్టాలను రద్దు చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా పార్లమెంట్ సమావేశాల్లో ఆ చట్టాలను రద్దు చేయబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. మరోవైపు రైతులకి క్షమాపణలు చెప్పడం విశేషం. కాగా నేడు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Centre accepts farmers demand

Centre accepts farmers demand

Agriculture Minister Narendra Singh Tomar వ్యవసాయంపై ప్రధాని కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఈ కమిటీలో భాగంగా పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, కనీస మద్దతు ధరలో పారదర్శకత లాంటి అంశాలను కమిటీ చర్చించి నిర్ణయాలను సిఫార్సు చేస్తుందని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. మరోవైపు ప్రధాని ఏర్పాటు చేసిన ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారని తెలిపారు. అలాగే రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడాన్ని నేరరహితంగా పరిగణించాలని రైతు సంఘాలు డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరించిందని ఆయన వెల్లడించారు.

modi

కాగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన తర్వాత రైతుల ఆందోళనను కొనసాగించడంలో అర్థం లేదని, రైతులు తమ ఆందోళనను విరమించి తిరిగి ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరారు. నిరసన సమయంలో నమోదైన కేసుల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటుందన్నారు. ఆ విషయాలపై రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని, పరిహారం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహిస్తాయని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. 3 Farm Laws

Leave Your Comments

కాంగ్రెస్ వరి దీక్ష !

Previous article

పంట నష్టంపై పరిహారం అందిస్తాం…

Next article

You may also like