Agricultural Technology 2022: ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసంబర్ 3 నుండి 5 తేదీల వరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, లాం, గుంటూరు నందు వ్యవసాయ సాంకేతికత 2022 అనే అంశంపై నూతన వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు మరియు ప్రదర్శనను నిర్వహించతలపెట్టినట్లు విశ్వవిద్యాలయ గౌరవ ఉపకులపతి. డా. ఆదాల విష్ణువర్ధన రెడ్డి గారు ప్రకటనలో తెలియజేసారు.

Agricultural Technology 2022
ఇందులో భాగంగా డా. ఆదాల విష్ణువర్ధన రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన మరియు అనుబంధ శాఖల, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం మరియు డా. వై. యస్. ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనా సంస్థల సహకారంతో, ప్రభుత్వ సహకారంతో, అంగు లోని 33 పరిశోధన స్థానాలు, 13 కృషి విజ్ఞాన కేంద్రాలు, 13 ఏరువాక కేంద్రాలు, మరియు సుమారు 150 ప్రైవేట్ సంస్థలు ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, కలుపుమందులు, శిలీంద్రనాశినులు, తెగుల్లా మందులు, పురుగు మందులు, యంత్రాలు, పరికరాలు, పనిముట్లు మరియు సాధనాలు సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందన్నారు.

Modern Agriculture
దీని ముఖ్య ఉద్దేశ్యం రైతులకు, రైతు మహిళకు నూతన వ్యవసాయ సాంకేతికతను చేరువ చేయదమే అని అన్నారు. ఇందులో సుమారు 40, 000 మంది (రోజుకు 15,000 పైచిలుకు) విద్యార్థులు, రైతులు, రైతు మహిళలు మరియు వ్యవసాయం లోని ఇతర భాగస్వామ్యులు పాల్గొన నున్నారని అన్నారు. దీనికై ఇప్పటికే విస్తృత ఏర్పాట్లుచేశామన్నారు. కావున రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినదిగా కోరారు.
Also Read: National Seed Conference 2022: హైదరాబాద్లో ఘనంగా జరిగిన జాతీయ విత్తన సదస్సు.!
Also Watch: