Chilli Exports: ప్రపంచవ్యాప్తంగా మిర్చి తనదైన శైలిలో ఘాటుగానే ధరను చూపుతోంది. కొన్ని రకాల వ్యాధుల వల్లన దిగుబడులు తగ్గిన సాగు పెరగడం, ఆశించిన మార్కెట్ విలువ రావటంతో మిర్చి ధరకు ఎగుమతుల రూపంలో ఈఏడాది సుమారు పదివేల కోట్లు రాబట్టింది. ప్రతి ఏటా భారతదేశం నుంచి ఎగుమతుల రూపంలో మిర్చి ఆశించిన స్థాయిలో లాభాలను అర్జిస్తుంది.
ముఖ్యంగా దేశంలోనే మిర్చి సాగుకు ఆంధ్రప్రదేశ్ కీలకంగా ఉండటంతో ఎక్కువ ఎగుమతి ఇక్కడి నుండే జరుగుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన నాలుగు సంవత్సరాలలో ఎగుమతుల్లో తారతమ్యాలు అటు ఇటుగా ఉన్నా వాటి విలువ మాత్రం కోట్ల రూపాయల్లో పెరుగుతూ ఉండటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే మిర్చి ఎగుమతుల విలువ సుమారు 20 వేల కోట్ల రూపాయల పెరుగుదలను చూపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎగుమతి క్వింటాకు సగటు ధర 20వేలు
మిర్చి లో ఉన్న పలురకాల ఆధారంగా ఈఏడాది ఎగుమతి చేసిన రకాలకు క్వింటాకు సగటున వాటి ధర రూ .20 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఎగుమతి తగ్గిన దాని విలువ మాత్రం అధికంగా నమోదైనట్లు సమాచారం. బహిరంగ మార్కెట్లో మిరప ధర క్వింటాకు రూ.25000 ఉండటంతో రైతులకు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. ఈక్రమంలో ప్రస్తుత ఏడాది కూడా మిర్చి పంటపై ఎక్కువ మంది రైతులు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎగుమతుల్లో ఎక్కువ ధరలు రావడం, ఆశించిన స్థాయిలో ఆదాయాలు పెరగటమే. ఈ క్రమంలో రైతులు మిర్చి పంట వైపు చూస్తున్నట్లు సమాచారం . గడిచిన నాలుగేళ్లలో మిర్చి పంట ఎగుమతుల విలువ రూ.6000 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల వరకు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.
Also Read: Mushroom Farming: పెరట్లో రైతు పండించిన 10 కిలోల పుట్టగొడుగు.!
గతంలో లేని విధంగా మార్కెట్ విలువ
మిర్చి ధరకు ప్రతి ఏడాది సానుకూల ప్రభావం పడుతూనే ఉంది. ఐదేళ్ల క్రితం వరకు మిర్చికి ధర విషయంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న రైతులు ఆ తర్వాత ఎగుమతులు, దానికి తగ్గట్టు ధర కూడా ఆశించిన స్థాయిలో ఉండటంతో రైతులు కొంత ఉపశమనం పొందినట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా మిర్చి సాగు గణనీయంగా పెరగటం ఇతర ప్రాంతాల్లో కొనుగోలు తగ్గటంతో ఆయా ప్రాంతాల్లో మిర్చి ధరలపై ప్రభావం చూపింది. దీంతో సుమారు మూడు వేల వరకు క్వింటా ధర తగ్గినట్లు మార్కెట్ అంచనా వేసింది. దీంతో కొంతమంది రైతులు ధర ఉన్నంతవరకు మిర్చిని అమ్మ కుండ మంచి రేటు కోసం ఎదురు చూడటం, కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం 70 లక్షల వరకు మిర్చి టిక్కిల విలువలు ఉన్నట్లు సమాచారం.
Also Read: Fisheries Incubation Centre: ఫిషరీస్ ఇంక్యుబేషన్ సెంటర్ కు ₹10 కోట్ల గ్రాంట్ చేసిన KUFOS