Anand Mahendra Intresting Tweet On Araku Coffee విశాఖ అరకులో పండించే మన్యం కాఫీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అరకు ప్రాంతాల్లో ఏజెన్సీ వాసులు పండించే కాఫీ రుచే వేరు. రంగు, రుచి, నాణ్యతతో మన్యం కాఫీగా భారీగా డిమాండ్ ఏర్పడింది. తాజాగా అరకు కాఫీపై ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహేంద్ర సరికొత్త పోస్ట్ తో సోషల్ మీడియాలో ఆసక్తి రేపారు. సమకాలీన అంశాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అనుభవాలను పంచుకునే ఆనంద్ మహేంద్ర గ్రామీణ ప్రాంత వాసుల ప్రతిభను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహేంద్ర అరకు కాఫీపై పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.
Araku Coffee అరకులో పండించే కాఫీని ఇష్టపడని వారుండరు. అలాగే భౌతిక శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆద్యుడైన నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ తాజాగా అరకు కాఫీని రుచి చూసి ఎంతో ఉల్లాసంగా కనిపించారు. అదేంటి అల్బర్ట్ ఐన్‌స్టీన్ చనిపోయి చాన్నాళ్లు అయింది కదా అనుకుంటున్నారా?. నిజమే ఇక్కడ కాఫీ తాగుతూ కనిపించేది అల్బర్ట్ ఐన్‌స్టీన్ బొమ్మ. ఐన్‌స్టీన్ సింగర్ జేమ్స్‌బ్రౌన్‌ల హుషారుగా మారడానికి కారణం… అతను కచ్చితంగా బెంగళూరులో ఉన్న అరకు కేఫ్‌లో కాఫీ తాగడమే కారణం అని అర్థం వచ్చేలా కామెంట్ రాశారు ఆనంద్ మహేంద్ర. అయితే ఆనంద్ మహేంద్ర ప్రస్తావించిన అరకు కాఫీ స్టోర్ బెంగుళూరులో ఉంది. ఆ కేఫ్ పేరు కూడా అరకు కేఫ్ కావడం విశేషం. Anand Mahendra
More than just a cup of coffee…it’s a philosophy of life… @arakucoffeein @naandi_india https://t.co/UfAH5RtIjF
— anand mahindra (@anandmahindra) October 1, 2021
కాగా..విశాఖ మన్యంలో ఏజన్సీలు పండించే అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచింది. రంగు, రుచి, నాణ్యతతో కాఫీ లవర్స్ ని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు దళారులు మాత్రమే ఈ కాఫీ గింజల్ని కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆ కాఫీని ప్రభుత్వరంగ సంస్థగా పేరొందిన జీసీసీతోపాటు నాంది, టాటా, ఇతర ప్రైవేటు సంస్థలు కాఫీ కొనుగోలు చేస్తున్నాయి. ఏటా ఆయా సంస్థలు మూడు నుంచి నాలుగు వేల టన్నుల వరకు రైతుల వద్ద సరకు తీసుకుంటున్నాయి. దీంతో కాఫీ పండించే రైతులకు ఆదాయం సమకూరుతుంది. Araku Coffee