వార్తలు

రైతువేదికలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

0

ఖిల్లాఘణపురం మండలంలో సోళిపూర్,మానాజిపేట,కమాలోద్దిన్ పూర్,ఘణపురం,మామిడి మాడ,అప్పారెడ్డిపల్లిలలో రైతువేదికలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.

  • రైతులందరిదీ ఒకే కులం రైతు కులం.
  • అద్భుతాలు సృష్టించ గల ఏకైక రంగం వ్యవసాయం
  • కరోనా తో అన్ని రంగాలు మూలనపడ్డా వ్యవసాయం ఆగలేదు.
  • ఒకప్పుడు ఏం పాపం చేసిండో సేద్యం చేస్తున్నడు అనేవారు
  • ఇప్పుడు ఆ పరిస్దితులు పోయాయి..వ్యవసాయం లో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
  • గత యాసంగిలో 39లక్షల ఎకరాలలో వరి సాగాయితే ఈ యాసంగిలో దాదాపు 50 లక్షల ఎకరాలలో సాగయింది.
  • సాంప్రదాయ పంటలు వీడి రైతులు పండ్లు,కూరగాయల వంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి.
  • త్వరలోనే రైతులను ఇతర రాష్ట్రాలకు పంటల పరిశీలనకు అధ్యయనానికి పంపుదాం.
  • 2,3 ఎకరాలలో మల్బరీ సాగుతో కర్ణాటక రైతులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.
  • రైతాంగానికి వ్యవసాయంలో మెళుకువలు తెలిపి వారిని ప్రోత్సహించెందుకే రైతు వేదికలు
  • రైతులను ఐక్యమత్యం చేసి వారిని ఒకే గొడుగు కిందకు తెచ్చి వారు సాగులో లాభాలు ఆర్జించే దిశగా నడిపించాలన్నదే ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఉద్దేశం
  • మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ వున్నా పంటలను రైతులు పండించాలి.
  • ప్రభుత్వం తన వంతు బాధ్యతగా రైతుబంధు,రైతుభీమా,24 గంటల ఉచిత కరెంటు తో పాటు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉంచుతుంది
  • రైతులు చేయవలసిందల్లా సాంప్రదాయ పంటలను పక్కన పెట్టి డిమాండ్ వున్నా పంటలను సాగు చేయడమే
  • వానాకాలం,యాసంగిలో వ్యవసాయ శాఖ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం పంటలు సాగు చేయించేందుకు వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలి…రైతులు అధికారుల సూచనల ప్రకారం పంటలు సాగు చేయాలి.
  • తెలంగాణ భూములతో పోలిస్తే పక్క రాష్ట్రాలలో దిగుబడులు తక్కువ వస్తాయి..రైతులు చేయాల్సిందల్లా అధికారుల సూచనలు పాటించడమే
  • రైతు వేదికలను సద్వినియోగం చేసి రైతులకు సలహాలు,సూచనలు ఇవ్వడం అధికారుల బాధ్యత… పాటించడం రైతుల బాధ్యత
  • ఖిల్లాఘణపురం మండలంలో సోళిపూర్,మానాజిపేట,కమాలోద్దిన్ పూర్,ఘణపురం,మామిడి మాడ,అప్పారెడ్డిపల్లిలలో రైతువేదికలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.

 

Leave Your Comments

బొప్పాయిలో వైరస్ తెగుళ్ళ యాజమాన్యం

Previous article

మిరపకోత సమయంలో, కోత తరువాత రైతులు చేపట్టవలసిన జాగ్రత్తలు

Next article

You may also like