రైతు కష్టానికి గిట్టుబాటు ధర దక్కాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ సాగు సానుకూల విధానాలతో తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది.
ఆరున్నరేళ్లలో తెలంగాణ అన్నపూర్ణగా మారింది అనడానికి గత ఏడాది ఎఫ్ సీ ఐ ధాన్యం సేకరణనే నిదర్శనం.
దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం కేవలం తెలంగాణ నుండే వరి ధాన్యం సేకరించారు.
మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల మీద అవగాహనతో ముందుకు సాగాలని వివిధ సమావేశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూచించారు.
శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనల మేరకు తెలంగాణ 4 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు వస్తాయని అంచనా.
ఈ నేపథ్యంలో మార్కెటింగ్ ఇంటలిజెన్స్ రీసెర్చ్, అనాలసిస్ వింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారు.
దీని నిమిత్తం రూ. 15 కోట్లు ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పరిణామాలు తెలుసుకుని రైతులకు మంచి ధర లభించేలా అవగాహన కల్పించేందుకు ప్రతిష్టాత్మక సంస్థ ఎర్నెస్ట్ & ఎంగ్ కు అప్పగించడం జరిగింది.
సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత కరెంటు వంటి అనుకూల విధానాలతో తెలంగాణలో రైతులు సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా సాగుకు ప్రోత్సహం అందించడం లేదు
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 55 శాతం కేవలం తెలంగాణ నుండే – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
Leave Your Comments