అబిడ్స్ లోని రెడ్డి హాస్టల్ ఆడిటోరియంలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం క్యాలెండర్, డైరీ -2021 ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. దేశంలో ఎక్కువగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగంపై ఎక్కువ ఖర్చు చేసింది తెరాస ప్రభుత్వం. వ్యవసాయం దిశ ఈనాడు మారింది. మంచి విత్తనాలు, కావాల్సినంత ఎరువులు, విద్యుత్, సాగు నీరు, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాల ద్వారా తెరాస ప్రభుత్వం రైతుల జీవితాల్లో భరోసాను నింపింది. జైకిసాన్ అన్న నినాదాన్ని తెరాస ప్రభుత్వం నిజం చేసి చూపింది. 62 లక్షల రైతు కుటుంబాల్లో వెలుగు రావాలి. రైతే రాజు కావాలి.”
- ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ది చేశారు
- వ్యవసాయ కుటుంబాలంటే చిన్నచూపు సమాజంలో ఉంది .. ఉద్యోగం చేస్తేనే జీవితం అన్నట్లు ఉంది
- భవిష్యత్ లో ఆధునిక వ్యవసాయం చేసే వ్యక్తి వరుడుగా కావలెను అన్న ప్రకటన పత్రికలలో రావాలి
- ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు .. ఖచ్చితంగా రైతును గౌరవించే, రైతును ప్రేమించే సమాజంతో పాటు, రైతును వరించే వధువులను చూడబోతున్నాం
- కోటి 45 లక్షల ఎకరాల క్రాప్ బుకింగ్ దేశంలో రికార్డు
- తెలంగాణ వ్యవసాయ అధికారులు ఎంతో గొప్పగా పనిచేశారు
- పదోన్నతుల విషయంలో ఆందోళన అక్కర్లేదు
- వీఆర్ఎలను ఏఓలకు అనుసంధానం చేసేందుకు చర్యలు
- కల్లాల నిర్మాణంలో వ్యవసాయ అధికారులకు ఇబ్బందులు ఉండవు
- క్రాప్ బుకింగ్ విషయంలో ఏఈఓలు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేయాలి .. ఏఓలు సహకరించాలి
- ఈసారి జరిగిన పొరపాట్లు భవిష్యత్ లో జరగకుండా చూసుకోండి
- బదిలీల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది .. ఏఓలకు వాహనాల విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది
- రైతువేదికలు రైతుశిక్షణా కేంద్రాలుగానే ఉంటాయి .. వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించడం జరగదు
- అధికారుల సహకారంతో వ్యవసాయ శాఖను ప్రక్షాళన చేస్తాం
- వ్యవసాయ శాఖ అగ్రస్థానంలో ఉండేందుకు సహకరించిన సిబ్బంది, అధికారులకు ధన్యవాదాలు
- తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం వ్యవసాయ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, అర్థికశాఖా మంత్రి హరీష్ రావు గారు
ఆర్థికమంత్రి హరీష్ రావు గారి కామెంట్స్
- నాకు వ్యవసాయ శాఖను చూసినప్పుడల్లా ఆనందం కలుగుతుంది
- ఈ శాఖలో అధికారులు రిటైర్డు అయిన తర్వాత కూడా సర్వీసులో ఉన్న అధికారులతో కలిసి పనిచేస్తారు
- మిషన్ కాకతీయ పథకం విజయవంతం అయ్యేందుకు కారణం పదవీ విరమణ చేసిన వ్యవసాయ అధికారులు ఇచ్చిన సహకారమే
- వ్యవసాయ రంగానికి వన్నెతెచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం
- దేశంలో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యధిక బడ్జెట్ కేటాయిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- నెలకు వెయ్యి కోట్లు ఉచిత కరంటుకు, ఏడాదికి ఏడున్నరవేల కోట్లు రైతుబంధుకు, ఏడాదికి 1300 కోట్లు రైతుభీమాకు ఖర్చుచేస్తున్నాం
- ఎన్టీఆర్ సర్కారులో కరువుమంత్రిగా ఉన్నప్పుడు చింతమడకలో, చంద్రబాబు సర్కారులో రవాణామంత్రిగా ఉన్నప్పుడు కందుకూరు మండలం రంగాపూర్ లో, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కేసీఆర్ గారు వ్యవసాయం చేయడం మానలేదు
- రైతు ముఖ్యమంత్రి ఉన్నందుకే వ్యవసాయరంగానికి ఇంత ప్రాధాన్యం, ఇన్ని పథకాలు సాధ్యమయ్యాయి
- జై జవాన్ – జై కిసాన్ నినాదాన్ని నిజం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
- రైతుకు గౌరవం దక్కాలి .. ఆ గౌరవాన్ని అధికారులు పెంచాలి
- ఎంత ఇబ్బంది ఉన్నా రైతుబంధు ఆపొద్దని కేసీఆర్ గారు అదేశించారు
- ఇప్పటికే రూ.6014 కోట్ల రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమయ్యాయి
- ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలని కోరినా ఇవ్వలేదు .. ఈ రోజు రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ , రైతుబంధు ఇస్తున్నాం
- మనందరం రైతు సేవకులం .. మీరు అధికారులైనా, మేము మంత్రులమైనా రైతుల సేవకోసమే
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కారు ఇది .. మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది
- రైతులకు అధికారులు సాంకేతిక పరిజ్ఞానం అందించాలి
- వానాకాలంతో పోటీపడి యాసంగి సాగు నడుస్తున్నది .. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయం
- ఉద్యమంలో భావజాలవ్యాప్తికి , ఇప్పుడు రైతుల కలలు సాధించేందుకు డైరీ ఆవిష్కరణలు వేదికలుగా మారాయి
Leave Your Comments