- నారు మళ్ళు పొసే నేల , మేరక మీద ఉండాలి. నీరు నిల్వ ఉండకూడదు.
- నేల ఉదజని సూచిక 5 ఉండాలి.
- నారు మళ్ళు తయారు చేసుకునే నేలను 4-5 సార్లు బాగా దున్నలి.
- నేలలో ఉన్న వేర్లను, కలుపు మొక్కలను తీసివేయాలి.
- ఒక హెక్టారుకు సరిపడ నారు పెంచడానికి 10మీ. 15 మీ విస్తీర్ణం గల నేలపై విధంగా తయారు చేసుకోవాలి.
- అందులో 9 మీ. పొడవు 1 మీటర్ వెడల్పు 15-20 సేం. మీ.ఎత్తులో నారు మాడులను తయారు చేసుకోవాలి.
- ప్రతి నర్సరీ బెడ్ కు మధ్య 30 సేం. మీ వెడల్పు 10 సేం. మీ లోతులో కాలువలు తీసుకోని వాటిని ఒక ప్రధాన కాలువలో కలుపుకోవాలి.ఈ విధంగా చేయడం వలన వర్ష కాలంలో అధిక నీరు తొలగించవచ్చు.
- ప్రతి బెడ్ కు 15 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు మరియు 100 గ్రా.నత్రజని, భాస్వరం మరియు పోటాష్ నిచ్చే రసాయన ఎరువులు వేయాలి.
- 100 వేప పిండి 5 గ్రా. ట్రైకోడెర్మా పోడిని కలిపి ఒక చదరపు మీటర్ నారుమడికి వేయాలి.
- నారు మళ్ళలో నారు కుళ్ళు తెగులు సోకాకుండా ముందు జాగ్రత్తగా లీటర్ నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సిక్లోరైడ్ తో శుద్ధి చేయాలి.
- నారు మళ్ళలో లేత మొక్కలను పురుగు మొదళ్ళ వద్ద కత్తిరించి నాశనం చేస్తాయి. వీటి నివారణకు క్లోరిఫైరిఫాస్ లీటర్ నీటికి కలిపి నారు మళ్ళ తయారీ సమయంలో నేలను తడపాలి.
- నారు మళ్ళలో 5-8 సేం. మీ ఎడం 1 సేం. మీ లోతులో వరుసల్లో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి.
- మొలకెతై వరకు ఎండు గడ్డితో నారుమళ్ళను కప్పాలి.
- రసం పీల్చే పురుగుల నుండి రక్షణ కొరకు నారు మళ్లకు 40-50 మెష్ నైలాన్ నెట్ తో కాప్పాలి.
- ఇమీడాక్లోప్రిడ్ 2 మీ. లీటర్ నీటికి కలిపి 7-10 రోజుల వయసు గల నారుపై పిచికారీ చేస్తే రసం పీల్చు పురుగుల నుండి రక్షించవచ్చు.
- నాటుకునే ముందు నారు గట్టి పడడం కోసం నీటి ఎద్దడి పరిస్థితులులను కల్పిచాలి.
- నారు తీయడానికి 2-3 రోజులకు లీటర్ నీటికి 2 మీ. లీ.డైమీతోయేట్ + కార్బడిజం కలిపి నారుమడిపైన పిచికారీ చేస్తే ప్రధాన పొలంలో 25 రోజుల వరకు మరియు తెగుళ్ళు నుండి మరియు పురుగుల నుండి రక్షణ పొందవచ్చు. లేదా ఇదే మందు ద్రావణంలో నారు పీకిన తర్వాత మొక్కల వేర్లు మునుగునట్లు 20 నిముషాలు ఉంచితే ఆ మందు వీటిని పీల్చుకుంటాయి. ఆ తర్వాత పొలంలో నాటుకోవచ్చు.
- రకాన్ని బట్టి మరియు పంటను బట్టి 25-42 రోజుల్లో ప్రధాన పొలంలో నారు నాటడానికి తయారుగా ఉంటుంది.
Also Read: Tobacco Weed Ownership: పొగాకులో కలుపు యాజమాన్యం.!
Must Watch:
Leave Your Comments