రకాలు: కావేరి 50, 30 వి 92, లక్ష్మీ- 2277, డి. హెచ్. ఎం-117
విత్తేసమయం: నవంబరు – జనవరి
విత్తన మోతాదు: ఎకరానికి 7-8కిలోలు.
విత్తేవిధానం: పొలం నుంచి వరి పనలు తీసిన తర్వాత సాళ్ళమధ్య 55-60 సెం.మీ., సాళ్ళలో మొక్కల మధ్య 20-25 సెం.మీ దూరంఉండేలా విత్తాలి.
జీవన ఎరువులు: ప్రకృతిలో కొన్ని రకాల సూక్ష్మజీవు లకు నాచు రకాలకు గాలిలోని నత్ర జని మొక్కకు ఉపయోగపడే విధంగా స్థిరీకరింపజేసే శక్తి ఉంటుంది. వీటినే జీవన ఎరువులని అంటారు.
మొక్కజొన్నలో వాడే జీవన ఎరువులు:
- అజోస్పైరిల్లమ్
- పాస్ఫరస్ సాల్యుబులైజింగ్బ్యాక్టీరియా
- వ్యామ్ (వెసికులార్ అర్బసిక్యు లార్ మైకోరైజా
అజోస్పైరిల్లమ్: ఇవి మొక్కలపై పూర్తిగా ఆధారపడకుండా వేర్ల దగ్గర లేదా వేర్ల మీద జీవిస్తాయి. ఇవి గాలిలోని నత్రజనిని తీసుకొని వేర్ల మీద స్థిరీకరించగలవు. పప్పుజాతి పైర్లకు తప్ప మిగిలిన పంటలైన వరి, చెరుకు, జొన్న, సజ్జ, పత్తి, మిరప, పొద్దుతిరుగుడు, కూరగాయల పైర్లు బాగా పనిచేస్తాయి.
మోతాదు: ఘన రూపంలో అయితే 200-400 గ్రాముల కల్చర్ను ఎకరానికి అవసరమైన విత్తనానికి పట్టించి వాడుకోవచ్చు లేదా 1 నుంచి 2 కిలోల కల్చర్ను 20 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీకం క పోస్టు ఎరువుతో కలిపి విత్తనం వేయడా నికి చేసుకోన్న రంధ్రాల్లో వేసుకోవాలి.ద్రవరూపంలో ఉన్న జీవన ఎరువు అయితే 500 మి.లీ ఎకరానికి సరిపోతుంది.
లాభాలు: ఇది ఎకరానికి సుమారు 8-16 కిలోల నత్రజనిని అందిస్తాయి. పెరుగుదల కారకాలైన హార్మోన్లు, విటమిన్లను ఉత్పత్తిచేస్తాయి. సేంద్రియ పదార్థం తగినంతగా ఉన్న నేలల్లో అజోస్పైరిల్లమ్ చర్య సమర్థవంతంగా ఉంటుంది.
Also Read: Importance of baby corn: బేబీ కార్న్ ఉపయోగాలు.!
ఫాస్ఫోబ్యాక్టీరియా: ఇవి నేలల్లో స్వతంత్రంగా జీవిస్తాయి వీటి నుంచి తయారయ్యే సేంద్రియ ఆమ్లాల వల్ల భూమిలో బిగుసుకుపోయి లభ్యంకాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని, ట్రైకాల్షియం ఫాస్ఫేటు, రాక్ఫాస్ఫేట్లలోని భాస్వరాన్ని, సేంద్రియ రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మారుస్తాయి. మొక్కల పెరుగుదలకు ఉపయోగ పడే హార్మోన్లలను కూడా ఉత్పత్తిచే స్తాయి. మొక్క వేర్ల దగ్గర వీటి చర్యలు చురుకుగా ఉండి జీవన క్రియకు తోడ్పడుతాయి. దీని ఫలితంగా దిగుబడి పెరుగుతుంది.
మోతాదు: 200–400గ్రా.ల కల్చర్ ఎకరానికి సరిపడా విత్తనానికి పట్టించి లేదా 1-2 కిలోల కల్చర్ను సుమారు 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి రంధ్రాల్లో వేసుకోవాలి.
లాభాలు: వీటి వాడకం వల్ల సిఫారసు చేసిన మోతాదు నుంచి ఎకర నికి 10-12 కిలోల భాస్వరాన్ని తగ్గిం క్ చుకోవచ్చు భాస్వరం తక్కువున్న దగ్గర నేలల్లో సేంద్రియ పదార్థం సమృద్ధిగా ఉన్న నేలల్లో వీటి వాడకం వల్లమంచి ప్రభావం కనిపిస్తుంది.
వ్యామ్: ఇవి వేరు మండలం మీద మొక్కతో కలిసి మైత్రితో అతిథిగా జీవిస్తాయి. మైకోరైజా శిలీంద్రం వేరు ఎగవేతకు పార్టీ భాగంలో పైపొరల్లోకి, లోపలి పొరల్లోకి కూడా చొచ్చుకొని పోగలవు. ఇవి ఆహారానికి మొక్కపై ఆధారపడతాయి. దీని బదులుగా ఇవి నేల నుంచి భాస్వరాన్ని మొక్కలకు అందిస్తాయి. ఈ ప్రక్రియలో శిలీంద్రం కన్నా మొక్క అధిక లాభాన్ని పొందుతుంది. ఇవి భాస్వరాన్ని గ్రహించి, నిల్వ ఉంచి అవసరమైనప్పుడు మొక్కకు అందిస్తాయి. ఈ శిలీంద్రం వేరు వ్యవస్థ చుట్టూ ఒక రక్షణ కవచం వలే ఏర్పడి రోగకారకాల ప్రవేశాన్ని నిరోధిస్తుంది.
ద్రవరూప జీవ ఎరువులను వాడే విధానం: ద్రవ రూపంలో ఉన్న అర లీటరు అజోస్పైరిల్లమ్, అర లీటరు ఫాస్పరస్ సాల్యుబ్యులైజింగ్ బ్యాక్టీరియాను 5 లీటర్ల నీటిలో కలిపి ఈ ద్రావణాన్ని 5 కిలోల వ్యామ్ పౌడర్తో కలిపి 100 కిలోల వానపాముల ఎరువు లేదా పశువుల ఎరువుతో కలిపి విత్తనం వేయడానికి ముందు రంధ్రాల్లో పైన కలుపుకొన్న ఎరువు వేసి తర్వాత విత్తనం వేసుకోవాలి.
Also Read: Corn Oil Health Benefits: మొక్కజొన్న నూనెతో ఆరోగ్యం మిన్నా!
Must Watch: