Lady Finger Farming: వర్షాకాలం ప్రారంభంలో భారతదేశంలో ధరలు పెరగడం ద్వారా ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరుగుతుంది. ప్రతి వస్తువుకి ధరలు పెరిగాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు పెరుగిపోతున్నాయి. టమాట, బెండకాయ, సీసా పొట్లకాయ, దోసకాయ, క్యాప్సికం, సహా అని కూరగాయల ధరలు పెరిగాయి. ఈ ద్రవ్యోల్బణం ద్వారా చాలా మంది రైతులు కోటీశ్వరులు అయ్యారు. అందరూ రైతులు టమాట అమ్ముకొని కోటీశ్వరులు అవుతే, బీహార్ రాష్ట్ర బెగుసరాయ్ జిల్లాలోని రైతు రామ్ విలాస్ సాహ్ బెండ కాయలు అమ్మి ధనవంతుడయ్యాడు.
రామ్ విలాస్ రైతు వ్యవసాయంతో ముందు సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం పొందేవారు. ప్రస్తుతం ఈ బెండ సాగుతో లక్ష రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. పండించిన పంట వెంటనే అమ్మడం ద్వారా పంట నాణ్యంగా ఉండి ఎక్కువ ధరకి అమ్ముతున్నారు.
Also Read: Green Gram Cultivation: పెసర పంట సాగు విధానం..
గ్రామంలో రైతులని చూసి బెండ సాగు మొదలు పెట్టాడు. ఈ సాగుకి పెట్టుబడి కూడా తక్కువ. కేవలం 3 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు. మొదటిలో బెండ సాగు నుంచి నెలకి 30 వేల రూపాయలు ఆదాయం పొందేవారు. ఇతర రైతుల నుంచి పండించే విధానంలో మార్పులు చేసి ప్రస్తుతం ఒక ఎకరం పొలంలో నెలకి దాదాపు లక్ష రూపాయల ఆదాయం పొందుతున్నారు.
ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా రామ్ విలాస్ గారి ఆదాయం ఇంకా పెరిగింది. ఇప్పుడు ఒక ఎకరంలో బెండ సాగు చేస్తూ 6 నెలలో 10 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నాడు. వ్యాపారులు తన పొలం దగ్గరికి వచ్చి బెండకాయలు కొనుగోలు చేస్తున్నారు. దాని వల్ల రవాణా ఖర్చు కూడా తగ్గింది. అందువల్ల ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తున్నాయి.
Also Read: Black Gram Cultivation: మినుము పంటను ఇలా సాగు చేసి మంచి దిగుబడిని పొందండి..