Eggplant Cultivation: భారత దేశంలో ప్రాచీన కాలం నుండి పండించే కూరగాయల్లో వంగ ప్రధానమైనది. ఈ పంటను అన్ని ఋతువులలో పండించుటకు అనుకూలం దీనిలో విటమిన్ ఏ,బి అధికంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 55000 హెక్టారుల సాగు చేస్తున్నారు, 45 లక్షల టన్నుల దిగుబడి నిస్తుంది. వంకాయ పంటకి ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు.
వంకాయ పంట సాగుకి లోతైన, సారవంతమైన మురుగు నీరు పోయే సౌకర్యం గల అన్ని రకాల నేలలు అనుకూలం. నేల ఉదజని సూచిక 5.5-6.5 నేలలు శ్రేష్ఠం. మన రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణంలో సుమారు 15-20 శాతం సంకర రకాలు సాగులో ఉన్నాయి.
ఎకరానికి సూటి రకాలకు 260 గ్రాముల సంకర రకాలు అయితే 124 గ్రాముల విత్తనం నారు నాటడానికి సరిపోతుంది. విత్తనం వారు మళ్ళలో పెంచి 3,4 ఆకులు వచ్చాక నారును అంటే దాదాపు 30-35 రోజుల వయస్సు గల మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. గుబురుగా పెరిగే రకాలను 75×50 సెం.మీ. పొడవున నిటారుగా పెరిగే రకాలను 50×50 సెం.మీ ఎడంతో నాటు కోవాలి.
ఆఖరి దుక్కిలో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియ మన్నాలి. దీనితో పాటు 24kg ల బాస్వరం, 24 kg ల పొటాష్ ఇచ్చే ఎరువులను వేయాలి. 40 kg ల సత్రజనిని 3 సమభాగాలుగా చేసి 30,6,75వ రోజు పై పాటుగా వేయాలి. సంకరజాతి రకాలను ఈ ఎరువుల మోతాదును 50 శాతం అధికంగా వేయాలి. ఎరువులు వేసిన వెంటనే తప్పని సరిగా నీటిని పెట్టాలి.
Also Read: Modern Seedling Cultivation: ఆధునిక సాగు పద్ధతిలో నారు పెంపకం, క్యూ కడుతున్న రైతులు.!
మొక్కల మధ్య, సాళ్ళలో కలుపు లేకుండా చూడాలి. పారతో మట్టిని మొక్కల మొదళ్ళ పైకి ఎగదోస్తే పంట బాగా పెరుగుతుంది. నాటేముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. పంట నాటిన 70 రోజుల వరకు తగినంత తేమ అవసరం భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7-10 రోజులకు ఒకసారి వేసవిలో 4-5 రోజులకు ఒకసారి. వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి.
వంకాయ కాపు బాగా ఉన్నప్పుడే కోయడం మంచిది కాయ సుమారు సైజులో నిగనిగలాడుతూ ఉన్నప్పుడే కోసినట్లయితే. మంచి ధర వస్తుంది. నాటిన 50-60 రోజుల మొదటి కోత వస్తుంది లేత కాయలను ప్రతి 3 రోజులకు ఒకసారి కోత కోయాలి. వర్షాకాలం, శీతాకాలంలో 8-14 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది, వేసవి కాలంలో 4-7 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వస్తుంది.
సాధారణ చలికాలంలో సుమారు 3-4 రోజులు, వేసవిలో 1-2 రోజులు నిల్వచేయవచ్చు. వంకాయ సుమారు 20 శాతం పరపరాగ సంపర్కం ఉన్నట్టు నిర్ధారించడమైనది. కాబట్టి రకాల మధ్య ఎక్కువ దూరంను ఉంచాలి. దాదాపు 100-200 మీటర్ల దూరం ఉండునట్లు జాగ్రత్త వహించాలి. బాగా ఎదిగిన పండిన వంకాయలను కోసి నీటిలో వేసి సులువుగా విత్తనాలను సేకరించవచ్చు. నీటి పైన తేలియాడే విత్తనాలను ఏరివేసి పాత్ర అడుగున చేరిన మంచి విత్తనాలను సేకరించి ఆరబెట్టి ఒక హెక్టారుకు సుమారు 100-200 కేజీల విత్తనాలను సేకరించవచ్చు.
Also Read: Carrot Cultivation: క్యారెట్ పంట ఇలా సాగు చేస్తే రైతులకి మంచి లాభాలు వస్తాయి.!