Groundnut Value Addition: మన దేశంలో 2021-22 సంవత్సరంలో సుమారు 28.0 మిలియన్ హెక్టార్లలో నూనె గింజల సాగు చేయడం ద్వారా సుమారు 33.4 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలను ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా సుమారు 9.5 మిలియన్ మెట్రిక్ టన్నుల వంటనూనెలను దేశీయంగా ఉత్పత్తి చేశారు. భారతదేశంలో ఏటా 9.56 మిలియన్ టన్నుల వేరుశెనగ ఉత్పత్తి జరుగుతుంది. సోయాబీన్ ఉత్పత్తి 11.2 మిలియన్ మెట్రిక్ టన్నుల తో నూనె గింజల ఉత్పత్తి లో మొదటి స్థానం లో ఉంది. రెండు మూడు స్థానాలలో వేరుశనగ మరియు ఆవాలు (9.1 మిలియన్ మెట్రిక్ టన్నుల) ఉన్నాయి.
మనదేశం యొక్క వార్షిక తలసరి నూనె వినియోగం 1970 దశకంలో సుమారు నాలుగు కిలోలు. 1990 దశకంలో అది సుమారు 10.2 కిలోలు. క్రమంగా పెరుగుతున్న జనాభా, మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లు అది ఇప్పుడు సుమారు 16.5 కిలోల తలసరి వార్షిక వినియోగ స్థాయికి చేరుకొన్నది. భారతదేశం సంవత్సరానికి సుమారు 15 మిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంటుంది.
Also Read:Seed Treatment in Groundnut: వేరుశెనగలో విత్తన శుద్ధి ఎలా చేయాలి.!
దీని విలువ సుమారు 10 అమెరికన్ బిలియన్ డాలర్లు. మన దేశం యొక్క వార్షిక వినియోగము సుమారు 23 మిలియన్ మెట్రిక్ టన్నులు. దిగుమతి చేసుకుంటున్న వంటనూనెలు సుమారు మన దేశీయ వినియోగంలో 70 శాతం. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరుగుతున్నది. వీటిలో వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, పొద్దుతిరుగుడు ప్రధానమైనవి. కొన్ని రోజులుగా పామాయిల్ సాగుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించి నూనె గింజల ఉత్పత్తి పెంచడానికి కృషి చేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటి ప్రాజెక్టులు, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుభీమా మరియు వ్యవసాయ మరియు ఇతర అనుబంధ రంగాల సబ్సిడీలు వలన ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నూనె గింజల తో పాటు ఇతర వ్యవసాయోత్పత్తుల పెరుగుదలకు ఎంతో దోహదం చేశాయి. ఆయా జిల్లాల ఉత్పత్తి ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాలు వేరుశెనగ మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మా లైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీం మరియు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా మన రాష్ట్రంలోని 3 (జోగులాంబ గద్వాల్, నారాయణపేట మరియు వనపర్తి) జిల్లాలోని రైతులు, యువతీ యువకులు మరియు సూక్ష్మ, చిన్న ప్రాసెసింగ్ మిల్లులు నడుపుతున్న యజమానులు ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా కొత్త ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆ జిల్లాలో కేటాయించబడిన వేరుశెనగ మరియు వాటి విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లు అయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది.
-రైతు క్షేత్రస్థాయిలో వేరుశనగ పొట్టు తీసి గ్రేడిరగ్ చేయడం ద్వారా రెట్టింపు ఆదాయం
-వివరాలు వేరు శనగ కాయలు (కిలోలు) వేరుశనగ కాయలు పొట్టు తీసిన తర్వాత రికవరీ
-రికవరీ చేసిన మొత్తం పల్లీలు కిలోలు రికవరీ చేసిన మొత్తం (ఎ) గ్రేడ్ పల్లీలు (కిలోలు) రికవరీ చేసిన మొత్తం (బి,సి) గ్రేడ్ పల్లీలు
మొత్తం వేరుశనగ కాయలు (కిలోలు) 100 75 40 35
-కనీస మద్దతు ధర లేదా రైతు క్షేత్రం నుండి కిలో వేరు శనక్కాయల ధర రూపాయలు 55.5
-పొట్టు తీసిన పల్లీలు (ఎ) గ్రేడ్ కు కిలో రిటైల్ మార్కెట్ ధర రూపాయలు.
-ఎ గ్రేడ్‌ను టేబుల్ పర్పస్ కోసం రిటైల్ మార్కెట్ ద్వారా తినడానికి మరియు ఇతర తినుబండారాలు స్నాక్స్ తయారు చేయడానికి వాడతారు 180
-పొట్టు తీసిన పల్లీలు (బి,సి) గ్రేడ్‌కు కిలో రిటైల్ మార్కెట్ ధర బి,సి గ్రేడ్ పల్లీలు నూనె తీయడానికి వాడతారు రూపాయలు 85
-పొట్టు తీసిన పల్లీలు (ఎ) గ్రేడ్ మరియు బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా లభించే స్థూల ఆదాయం రూపాయలు 7200 2975
-క్వింటాల్ వేరు శనగ కాయల ద్వారా లభించే మొత్తం స్థూల ఆదాయం రూపాయలు 10175(7200ం2975)
-కనీస మద్దతు ధర (2021-22) క్వింటాల్ వేరుశనగ కాయలకు రూపాయలు 5550.
-క్వింటాల్ వేరుశనగ కాయల పొట్టు తీసిన తర్వాత (ఎ) గ్రేడ్ మరియు బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా లభించే ఆదాయం రూపాయలు 4625
-బి,సి గ్రేడ్ పల్లీలు నూనె తీయడానికి వాడతారు
-బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా నూనె తీయడం ద్వారా లభించే నూనె శాతం 40%
-బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా నూనె తీయడం వలన పొందే మొత్తం నూనె (కిలోలు) 14
-కిలో వేరుశనగ నూనె ధర 200
-బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా నూనె తీయడం వలన పొందే మొత్తం స్థూల ఆదాయం రూపాయలు 2800
-బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా నూనె తీసిన తర్వాత మిగిలే పల్లీల గానుగా చెక్క (కిలోలు) 19.25
-కిలో పల్లీల గానుగా చెక్క ధర 38
-గానుగా చెక్క ధర పొందే మొత్తం స్థూల ఆదాయం రూపాయలు 731.5
-బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా లభించే మొత్తం స్థూల ఆదాయం రూపాయలు 3531.5
క్వింటాల్ వేరు శనగ వేరుశనగ కాయలు పొట్టు తీసి (ఎ) గ్రేడ్ మరియు బి,సి గ్రేడ్ పల్లీల అమ్మడం ద్వారా లభించే మొత్తం స్థూల ఆదాయం రూపాయలు 10175
క్వింటాల్ వేరు శనగ వేరుశనగ కాయలు పొట్టు తీసి (ఎ) గ్రేడ్ పల్లీలు అమ్మడం మరియు బి,సి గ్రేడ్ పల్లీల ద్వారా నూనె తీయడం వలన పొందే ద్వారా మొత్తం స్థూల ఆదాయం రూపాయలు 10731.5
వేరుశెనగ రకము, వేరుశనగ కాయ నాణ్యత, గ్రేడిరగ్ ద్వారా రికవరీ, రిటైల్ మార్కెట్ ధర, ప్రాసెసింగ్ పద్ధతులను అనుసరించి పైన తెలిపిన ధరలకు హెచ్చుతగ్గులు ఉంటాయి.
Also Read: Cashewnut Grafting Method: జీడీ మామిడిలో ప్రవర్ధనం ఎలా చేస్తారు.!
మనలో చాలామందికి ఒక అపోహ ఉంది. రిటైల్ మార్కెట్లో కిలో పల్లీలు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంది. వేరుశెనగలో నూనె శాతం సుమారు 45-50 శాతం ఉంటుంది. అంటే రెండున్నర కిలోల పల్లీల నుండి నూనె తీస్తే ఒక కిలో నూనె లభిస్తుంది. మరోవైపు కిలో పల్లీ నూనె ధర మార్కెట్ లో రూ.180 నుండి 200 రూ. వరకు ఉంది. పల్లీల ధర మరియు పల్లి నూనె ధరలు పరిశీలించినట్లయితే ఇంత తక్కువ ధరకు నూనె ఎలా లభిస్తుంది. నూనెకు పెట్రోకెమికల్స్‌తో కల్తీ చేస్తారని అందరూ అనుకుంటారు. మార్కెట్లో లభించే వేరుశెనగ నూనె ఎలాంటి కల్తీ చేయకుండానే కిలో పల్లీ నూనె ధర మార్కెట్‌లో రూ.180 నుండి రూ. 200 వరకు అమ్మవచ్చు, ఎందుకంటే పరిశ్రమలలో పల్లీ నూనె గ్రేడ్ పొట్టు తీసిన పల్లీల నుండి నూనె తయారు చేస్తారు. పొట్టు తీసిన పల్లీలు గ్రేడ్‌కు కిలో రిటైల్ మార్కెట్ ధర 65 నుండి 80 రూపాయల వరకు ఉంటుంది. బి, సి గ్రేడ్ పల్లీలు నూనె తీయడానికి వాడతారు తద్వారా మార్కెట్‌లో రూ.180 నుండి రూ. 200 మనకు మార్కెట్లో పల్లీ నూనె లభిస్తుంది.
ప్రసిద్ధ వేరుశనగ వాణిజ్య రకాలు :
కదిరి-6, కదిరి-9, అనంత, కదిరి హరిత ఆంధ్ర, ఐ సి జి వి -91114, ధరణి, టి ఏ జి-24, కదిరి-7, కదిరి-8, కదిరి-2, కదిరి-3, బిజి-1, బిజి-2, కుబేర్ , జిఎయుజి-1, జిఎయుజి-10, పిజి-1, టి-28, టి-64, చంద్ర, చిత్ర, కౌశల్, ప్రకాష్, అంబర్
వేరుశనగ పొట్టు తీసే యంత్రం :
గంటకు 500 కిలోల వేరుశనగ పొట్టు తీసే యంత్రాలు మార్కెట్లో లభిస్తాయి. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు వాటి సామర్థ్యము, నిర్మాణం మొదలైన అంశాలపెన ఆధారపడి వాటి ధరలు ఉంటాయి.
యంత్రం పరిమాణం (సంఖ్య) మొత్తం (రూ. లక్షల్లో)
వేరుశనగ పొట్టు తీసే 1 3.0
యంత్రం (15 హెచ్.పి) గంటకు 500 కిలోల వరకు పొట్టు తీస్తుంది.
పైన తెలిపిన ధరలకు హెచ్చుతగ్గులు ఉంటాయి.
పెరుగుతున్న వంటనూనెల ధరలు, దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన మార్కెట్లో వంటనూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నూనె గింజల మరియు ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతున్నది. మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి వేరుశనగ, సోయాబీన్, నువ్వులు మరియు పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వేరు శనగ వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి మరియు సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల మరియు తెగుళ్ళ నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహణ ద్వారా విత్తనం నుండి వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరచి విలువ ఆధారిత పదార్థాలు తయారు తయారుచేసి ప్యాకేజింగ్ మెటీరియల్లో వినియోగదారుడికి సులభంగా వాడుకునే విధంగా ఉండి వంట గదికి, వినియోగదారుడు ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్‌కు చేరే అంతవరకు తగిన యజమాన్య పద్ధతులు పాటించి సరసమైన ధరలో అమ్మి నట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది.
భవిష్యత్తులో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ద్వారా రైతులకు, వినియోగదారులకు మరియు గ్రామీణ యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. జిల్లా మరియు క్షేత్రస్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ద్వారా పంటకోత నష్టాలను తగ్గించడానికి మరియు రైతు స్థాయి లో మరియు వినియోగదారుని స్థాయి లో ధరల స్థిరీకరణలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
-ఎ. పోశాద్రి, జి. శివచరణ్, యం. సునీల్ కుమార్, యం. రఘువీర్,
-ఎ. రమాదేవి, వై. ప్రవీణ్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్, ఫోన్ : 9492828965.
Also Read: Groundnut harvesting and Storage: వేరుశనగ కోత మరియు నిల్వ సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!