మన వ్యవసాయం

Sheep Farming: ఆడ గొర్రెల ఎంపిక విషయం లో తీయాల్సిన జాగ్రత్తలు

2

Sheep Farming: గొర్రెల నుండి అధిక లాభాలు పొందేందుకు ఆయా ప్రాంతాలకు అనువైన జాతిని ఎంపిక చేసుకోవాలి. మన రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో “నెల్లూరు” జాతిని, తెలంగాణా ప్రాంతంలో ” దక్కని” జాతిని పెంచుతున్నారు. మన రాష్ట్రం దాదాపు 96 లక్షల గొర్రెలు కలిగి దేశంలోనే నాల్గవ స్థానంలో ఉన్నది. గొర్రెల పెంపకం వాణిజ్య పరంగా మంచి లాభదాయకం.

Sheep Farming

Sheep Farming

ఎంపిక:

  • మందలో పునరుత్పత్తి శక్తి తగ్గిన వాటిని, పళ్ళులేని ముసలి గొర్రెలను ఏరివేయాలి. ఒక సంవత్సరం కన్నా ఎక్కువ కాలం కట్టుకు రాని గొర్రెలను, గొడ్డుమోతు జీవాలను మంద నుండి ఏరివేయాలి.
  • ఆడ గొర్రెలను సంతలో కొనరాదు, రైతుల మందలో చూసికొనాలి.
  • చూడి లేదా తొలిసూరి ఈనిన గొర్రెలను కొన్న ఎడల నాలుగు కాలాలపాటు మందలో ఉండి లాభాన్నిస్తాయి.
  • గొర్రెలు సీజనల్ బ్రీడర్స్. 80-90% గొర్రెలు జూన్ నుండి ఆగష్టు వరకు ఎదకొస్తాయి. రెండవ సీజన్ జనవరి నుండి మార్చి వరకు ఉంటుంది.

Also Read: గొర్రెల్లో వచ్చే చిటుక వ్యాధి

Sheep Farming in India

Sheep Farming in India

  • ఆడ గొర్రె ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే కట్టుకు వచ్చి పుష్టిగా ఉండే పిల్లలను ఇవ్వగలవు.
  • బ్రీడింగ్ సీజన్ కు ఒక నెల ముందు నుండి మేపునకు అదనంగా రోజుకు 150 200 గ్రా. సమీకృత దాణ ఇచ్చిన ఎడల జీవాలు పుష్టిగా తయారై, ఎక్కువ సంఖ్యలో ఎదకు రాగలవు.
  • పోతును ఎల్లకాలం మందలో ఉంచరాదు. పోతును వేరుగా మేపి బ్రీడింగ్ సమయాల్లో మాత్రం గొర్రెల మందలో కలిపిన ఎక్కువ గొర్రెలు ఎదకు వచ్చే ఆస్కారం ఉంది.
Sheep

Sheep

  • గొర్రెల్లో పిండా భివృద్ధి చివరి రెండు మాసాల్లో ఎక్కువ ఉంటుంది. కావున వీటికి చివరి రెండు నెలలు రోజుకు 150-200 గ్రా. దాణా ఇవ్వాలి.
  • కొత్తగా ఈనిన గొర్రెలకు మొదటి మూడు నెలలు 150-200 గ్రా. దాణా ఇచ్చిన ఎడల పాల దిగుబడి పెరిగి పిల్లలు ఏపుగా పెరగగలవు.

Also Read: మేకల లో పోషక యజమాన్యం

Leave Your Comments

Turkey Poultry Farming: టర్కీ కోళ్ళ పెంపకం లో పోషక యాజమాన్యం

Previous article

Weeding Instrument: వరి కలుపు ఇక సులువు

Next article

You may also like