Organic Farming: రాజస్థాన్ రైతు హుకుమ్‌చంద్ పాటిదార్… ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అతని సక్సెస్ స్టోరీ తప్పకుండా ఎందరికో స్ఫూర్తినిస్తుంది. హుకుమ్‌చంద్ పాటిదార్ 10వ తరగతి మధ్యలోనే ఆపేసి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. రసాయన ఎరువులతో సేద్యం చేస్తున్న రైతుల్ని చూసి ఎంతో బాధపడ్డాడు. రసాయన ఎరువులతో సేద్యం చేయడం వల్ల నష్టాలపై అధ్యాయనం చేశాడు. అలా మొదలైన పాటిదార్ ఆలోచన సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసేలా చేసింది.
పాటిదార్ సేంద్రీయ మార్గాల ద్వారా మాత్రమే ఉత్పత్తులను ఉత్పత్తి చేసే పద్ధతులను కనిపెట్టాడు. కాగా రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లాలోని తన స్వగ్రామమైన మన్పురాలో ఆయన చేసిన విశేషమైన పనికి హుకుమ్‌చంద్ పాటిదార్ (Hukumchand Patidar) కు 2018లో పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. మరుసటి సంవత్సరం 2019లో సేంద్రీయ వ్యవసాయంలో ఆయనకున్న పరిజ్ఞానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్చే పౌర పురస్కారం అందుకున్నారు. అదేవిధంగా పాటిదార్ తనకున్న వ్యవసాయ భూమి నుండి ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా జపాన్ మరియు జర్మనీలలో అయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
Also Read: ఆకుకూరల సాగుకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న గ్రామం
మరో విశేషం ఏంటంటే.. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు కొత్త సిలబస్‌ను సిద్ధం చేయాలని హుకుంచంద్ పాటిదార్‌ను కోరారు. అంతేకాకుండా హుకుంచంద్ పాటిదార్ ఇప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఏర్పాటు చేసిన కొత్త కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు. తన అనుభవం మరియు జ్ఞానం ద్వారా పాటిదార్ విద్యాసంస్థల్లో కొత్త సిలబస్‌ను త్వరలో అమలు చేయనున్న జాతీయ కరిక్యులమ్ కమిటీకి సహకరించాలని కోరుతున్నారు సంబంధిత అధికారులు.
Also Read: మనోధైర్యమే మహిళా రైతును చేసింది