ఆరోగ్యం / జీవన విధానం

Ginger Cultivation: అల్లంలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..

0

Ginger Cultivation: భారతదేశంలో అల్లం పంటను సుమారు 85.93 వేల హెక్టార్లలో సాగు చేస్తూ 3.07లక్షల టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నారు. అల్లం విస్తీర్ణంలో నైజీరియా (56.23శాతం) తర్వాత 23.6శాతం విస్తీర్ణంతో భారతదేశం రెండో స్థానంలో ఉంది. అల్లం ఉత్పత్తిలో మాత్రం భారతదేశం 32.75శాతంతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా మెదక్‌, సిద్దిపేట్‌, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్‌, వరంగల్‌, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలో అధికంగా సాగు చేస్తారు.

Ginger Cultivation

Ginger Cultivation

అల్లం ఉపయోగాలు:

  • మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం.
  • బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు.
  • ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
  • అల్లం మంచి యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది .
  • రక్త శుద్ధికి తోడ్పడుతుంది .
  • రక్తం రక్త నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది .
  • అల్లం కొన్ని వారాలపాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి .
  • అల్లం వల్ల కడుపులో పూత (అల్సరు) ఏర్పడదు .
  • అల్లము నోటి దుర్వాసనను పోగొడుతుంది .  నోటిలో చేరిన ప్రమాదక బ్యక్టీరియల్ను సంహరించి, దంటాలను ఆరోగ్యముగా ఉంచుతుంచి .
  • అల్లం నుండిఅల్లం నూనెను తయారు చేస్తారు.

Also Read: మన్యంలో అల్లం సాగు..

శొంఠి:

  • ఏండ పెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.
  • మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
  • బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు
  • పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు.
  • ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.

ఔషధముగా:

  • ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది.ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుట్టును.
  • అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
  • కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లాన్ని జలుబు, ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
  • అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.
  • అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
  • అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
  • గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము, వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.

Also Read: అండు కొర్రలతో ఎన్నో ప్రయోజనాలు..

Leave Your Comments

ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు…

Previous article

Jaggery Making in Sugarcane: చెఱకు నుండి బెల్లం తయారీలో మెళకువలు

Next article

You may also like