TS Govt Releases Pending Amount For Agriculture Department రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశపెడుతుంది. వ్యవసాయ శాఖను అభివృద్ధి చేసే దిశగా కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ఒకటి. ఈ పథకం కింద కేంద్రం రాష్ట్రానికి బడ్జెట్లో భాగంగా 60 శాతం బకాయిలు చెల్లిస్తుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పెంచి రాష్ట్ర వ్యవసాయ శాఖకు అందిస్తుంది. అయితే 2016-17 నుంచి 2019-20 సంవత్సరానికి గానూ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న రూ.372.34 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధి కోసం 2007 నుంచి ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. కేంద్రం వాటా కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 40 శాతం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర వాటాను తాజాగా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వ్యవసాయ శాఖకు రూ.372.34 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు బీఆర్వో విడుదల చేశారు. Telangana Agriculture