PM Kisan Samman Nidhi: చిన్న రైతుల సవాళ్లను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. వారి ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రైతులకు ఎంతో భరోసా కల్పిస్తుంది. ఈ పథకం కింద ఏడాదికి రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది కేంద్రం ప్రభుత్వం. అయితే ఇవి ఒకేసారి కాకుండా.. విడుతల వారిగా నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.
ఇప్పటివరకు ఈపథకంలో భాగంగా 9 విడతలుగా రైతులకు నగదు జమ చేశారు. ఇక పదవ విడత డిసెంబర్ నెలలో రానుంది. నివేదికల ప్రకారం డిసెంబర్ 15న రైతులు పదవ విడత డబ్బులు అందుకోనున్నారు. తాజాగా ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అంటే రూ.6 వేలకు బదులుగా రూ.12 వేలు ఇవ్వనుంది. దీంతో ప్రతి విడతలో రైతులకు రూ.2 వేలకు బదులుగా రూ.4 వేలు జమకానున్నాయి.
Also Read: Garlic Harvesting: వెల్లుల్లి కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
ఈ ఆర్థిక సంవత్సరం (2020-2021)లో ఏప్రిల్-జులై మధ్య కాలానికి మొదటి విడత నిధులు ఇవ్వగా… ఆగస్ట్ నుంచి నవంబర్ నాటికి రెండో విడత నిధులు ఇచ్చారు. మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి వరకూ ఉంటుంది. ఈ నిధులు డిసెంబర్‌లో వచ్చాయి. ఇప్పటివరకూ ఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 11.17 కోట్ల మంది రైతులకు… రూ.95 కోట్లను విడుదల చేసింది. మరిన్ని వివరాలు మరియు సమాచారం కోసం, పిఎం-కిసాన్ పథకం కింద రైతు-లబ్ధిదారులు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో pmkisan.gov.in ని లాగిన్ అవ్వవచ్చు.
Also Read: Seed Treatment in Groundnut: వేరుశనగ లో విత్తనశుద్ధి తో తెగుళ్ళ కు చెక్