( PM Narendra Modi ): రైతుల తీవ్రంగా వ్యతిరేకించిన మూడు వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. జాతిని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు నోటిమాట సరిపోదని, వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆ మూడు సాగు చట్టాలను రద్దు చేసిన తరువాతే మా పోరాటం విరమిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ (Rakesh Tikait )స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నిర్ణయంపై స్పందించిన టికాయత్… సాగు చట్టాల రద్దుని స్వాగతిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.( Three farm laws Live Updates )
( 3 Farm Laws To Be Cancelled )గురునానక్ జయంతి రోజున మోడీ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై కిసాన్ మోర్చా హర్షం వ్యక్తం చేసింది. కాగా కేంద్రం మొండి వైఖరిపై మోర్చా అసహనం వ్యక్తం చేసింది. లఖింపూర్ ఖేరీ హత్యలతోసహా ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయింది. అదేవిధంగా రైతులందరికీ లాభదాయక ధరల కోసం చట్టబద్ధమైన హామీ వచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపింది. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణతోపాటు రైతుల ఈ ముఖ్యమైన డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని వ్యాఖ్యానించింది.
( Centre takes back 3 farm laws )రైతు వ్యతిరేక సాగు చట్టం జూన్ 2020లో అమలైంది. అయితే ఆ చట్టం కేవలం కార్పొరేట్ పెద్దలకి మాత్రమే మేలు చేకూరుస్తుందని, ఆ చట్టం కారణంగా రైతులు ఆ బడాబాబుల దగ్గర కీలుబొమ్మగా మారేలా ఈ చట్టం ముఖ్య ఉద్దేశంలా కనిపిస్తుందంటూ రైతు సంఘాలు ఏకమయ్యాయి. దాంతో కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్దపడ్డాయి. ఒకానొక సమయంలో పార్లమెంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు కూడా జరిగాయి. మొత్తానికి నేడు ఆ మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రధాని ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రైతులకి క్షమాణాలు చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
एमएसपी पर गारंटी कानून बनने तक जारी रहेगा आन्दोलन ;- @RakeshTikaitBKU pic.twitter.com/JQOCoOLe44
— Rakesh Tikait (@RakeshTikaitBKU) November 19, 2021
Also Read : వ్యవసాయ చట్టాల రద్దుపై తెలంగాణ మంత్రుల కామెంట్స్