తెలంగాణ సేద్యంవార్తలు

పంట నష్టం, రుణమాఫీ, ఫసల్ భీమా యోజనపై సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

0
  • కేంద్ర పంటల భీమా విధానం మారాలి .
  • ఇన్సూరెన్స్ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోవాలి  ఫాం వైజ్  ఫార్మర్ వైజ్ ఇన్సూరెన్స్ విధానం మీద అధ్యయనం చేయాలి.
  • గుండుగుత్తగా ఏరియా, గ్రూపు వైజ్ ఇన్సూరెన్స్ ల మూలంగా కంపెనీలకు డబ్బులు కట్టడమే తప్ప రైతులకు మేలు జరగడం లేదు
  • వాహన ప్రమాద భీమా, అగ్ని ప్రమాద భీమా తరహాలో రైతు కేంద్రంగా ప్రీమియం అంచనాతో కొత్త విధానం తేవాలి
  • రైతు కట్టిన ప్రీమియం కన్నా పరిహారం తక్కువ వస్తుంది .. అందుకే కేంద్రం అప్షనల్ చేసి చేతులు దులుపుకుని నెపం రాష్ట్రాల మీద నెట్టింది
  • ఫసల్ భీమా కింద 2016 – 17, 2017 -18 లకు గాను తెలంగాణ ప్రభుత్వం భీమా ప్రీమియం చెల్లించింది .. రైతులకు భీమా పరిహారం డబ్బులు వచ్చాయి
  • 2018- 2019, 2019 – 20 కి గాను చెల్లించాల్సిన డబ్బులు కొన్ని చెల్లించింది.. మిగతావి బడ్జెట్ లో కేటాయించడం జరిగింది .. త్వరలోనే చెల్లించడం జరుగుతుంది
  • గత ఏడాది కేంద్రప్రభుత్వం ఫసల్ భీమా పథకాన్ని అప్షనల్ చేసింది .. దీంతో దేశంలోని గుజరాత్, పంజాబ్, ఏపీ, బీహార్, పశ్చిమబెంగాల్ , జార్ఖండ్ రాష్ట్రాలు దీని నుండి వెనకకి వెళ్ళాయి.
  • ప్రపంచంలో రైతుకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ….రైతులు అప్పుల నుండి బయట పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
  • ప్రతి సారి రైతు అప్పుల్లో కూరుకుపోయాడు అంటూ చర్చలు వద్దు .. వారిని ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిపించాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నాయి.
  • ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 35 శాతం అధిక వర్షపాతం నమోదయింది
  • దేశంలో భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం వ్యవసాయ శాఖ ఏ వర్షానికి నష్టాలు అంచనా వేయాలో కొన్ని ప్రామాణికతలున్నాయి.
  • రాష్ట్రంలో ఈ వానాకాలం కురిసిన సాధారణ వర్షపాతం 720.40 మిల్లీమీటర్లు
  • ఇప్పటివరకు మొత్తం 1009.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
  • భారత వాతావరణ విభాగం లెక్కల ప్రకారం 1 సెంటిమీటరు వర్షం పడితే స్వల్ప వర్షపాతం. 2 నుండి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయితే సాధారణ వర్షపాతం, 6నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయితే భారీ వర్షపాతం, 11 నుండి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయితే అతి భారీ వర్షపాతం, 21 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయితే అత్యంత భారీ వర్షపాతంగా పరిగణించడం జరుగుతుంది.
  • జులై నెలలో ఒక్క రోజు మాత్రమే 19 జిల్లాలలో అతిభారీ వర్షపాతం నమోదయింది .. అలాగే సెప్టెంబరు నెలలో ఒక్క రోజు మాత్రమే 18 జిల్లాల్లో నమోదయింది.
  • ఇది మినహాయిస్తే మొత్తం సాధారణ వర్షపాతమే నమోదయింది .. వ్యవసాయ శాఖ నివేదిక ప్రకారం జూలై, సెప్టెంబర్ మాసాలలో కురిసిన వర్షాలకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యవసాయ అధికారులు వివరించారు.
  • వర్షంమూలంగా నీట మునిగిన చోట కూడా చాలా చోట్ల మరుసటిరోజుకు నీళ్లు వెళ్లిపోతాయి.
    మరి కొన్ని చోట్ల రైతులు కొత్త పంటలను వేసుకున్నారు ….ఇక్కడ మొత్తం పంటకు నష్టం జరిగింది అన్న అన్వయింపు సబబు కాదు

పంట నష్టాలకు సంబంధించిన వివరాలు సభకు సమర్పించడం జరిగింది

  • 52.5 శాతం రాష్ట్రంలో కౌలురైతులు అన్న వాదన శుద్ద తప్పు. రాష్ట్రంలో రైతుల వివరాలన్నీ వ్యవసాయ శాఖ వద్ద నమోదై ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలో ఇన్ని వివరాలు , ఇంత శాస్త్రీయంగా లేవు ప్రతి కుంట నమోదై ఉంది.
  • 92.5 శాతం రైతాంగం సన్న, చిన్న కారు రైతులు ఉన్నారు .. విపక్షాల వద్ద కౌలు రైతుల వివరాలు ఉంటే సమర్పించాలి
  • కౌలు రైతులు ఉంటే ఏడాదికేడాదికి ఒప్పందాలుంటాయి .. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా అచ్చంగా కౌలు రైతుల పరిస్థితి తెలంగాణలో ఉండదు
  • ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వలేదన్న మల్లు భట్టి విక్రమార్క వాదన తప్పు .. 2009 నుండి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో బకాయి ఉన్న ఇన్ ఫుట్ సబ్సిడీ రూ.668 కోట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది.
  • 4.36 లక్షల మంది రైతాంగానికి రూ.50 వేల వరకు రుణమాఫీ రూ.843.62 కోట్లు చెల్లించడం జరిగింది .. మరో రూ.1570.61 కోట్లు 4.61 లక్షల మందికి ఇవ్వాల్సిన ప్రక్రియ కొనసాగుతున్నది.

 

Leave Your Comments

కోడిగుడ్డులో అత్యధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది

Previous article

భవిష్యత్ అంతా వ్యవసాయ రంగానిదే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Next article

You may also like