వార్తలు

కినోవా పంట సాగు.. రైతు లాభాల బాట

0

ప్రస్తుతం రైతులు నూతన రకమైన పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శాపూర్ గ్రామంలో సాగు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను గడిస్తున్నారు. శాపూర్ గ్రామంలో ఓ రైతు 6 గుంటల పొలంలో కినోవా పంటను సాగు చేస్తున్నాడు. ఈ పంటను యాసంగిలో నీటి వసతి కింద అక్టోబర్ మొదటి 15 రోజుల నుంచి నవంబర్ మొదటి 15 రోజుల వరకు సాగు చేసుకోవచ్చు. పంట కొన్ని రకాల భూముల్లో వేసుకోవచ్చు. ఎకరానికి 6 – 8 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నది. పంటలో మాంసకృత్తులు, లైసీన్, మితియోనిన్ లాంటి అమైనో ఆమ్లాలు, బీ, ఈ విటమిన్లు, సూక్ష్మ పోషకాలు, పీచుపదార్థాలు ఉంటాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా రాయికోడ్ మండలంలోని శాపూర్ గ్రామంలో పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటను రైతుల నుంచి నేరుగా వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు చేస్తారు. పంటను రైతులు అనువుగా సాగుచేసుకోవచ్చు. బీపీ, షుగర్ ఉన్న వారికి ఈ పంట ఎంతో మేలు చేస్తున్నది. రాజస్థాన్, ఇతర దేశాల్లో మాత్రమే సాగు చేస్తారని రాయికోడ్ వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ పొలాల్లో సాగు చేసుకోవాలని సూచించారు. ఎరువులు, విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తామన్నారు.
కినోవాలో 14 -18 శాతం మాంసకృత్తులు, లైసీన్, మితియోనిన్ అరుదైన అమైనో ఆమ్లాలు, విటమిన్లు – బీ, ఈ , సూక్ష్మ పోషకాలు, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పీచు పదార్థాలు ఉంటాయి. కినోవా వెడల్పు లాంటి ఆకులు గల ఏకవార్షిక ఆహార పంట. ఈ పంట సుమారు 1.0 – 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వీటి విత్తనంపై పొరలో సోపోనిన్ లు ఉండటంతో చేదు రుచి, వస్తున్నది. విత్తనంపై పొరను తప్పని సరిగా తీసి వాడాలి.

Leave Your Comments

పంటలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితిని రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఖరారు..

Previous article

పెసలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like