సేంద్రియ వ్యవసాయం

Organic Farming Health Benefits: సేంద్రియ వ్యవసామయే ఆరోగ్యం.!

1
Organic Farming Health Benefits
Organic Farming

Organic Farming Health Benefits: ఆరోగ్యం, ఆనందం, తృప్తి.. వీటన్నింటికి అవినాభావ సంబంధం ఉంది. వీటన్నింటికి మన జీవనశైలితో విడదీయరాని బంధం ఉంది. జీవనశైలి సరిగ్గా ఉంటేనే అన్ని సరిగ్గా ఉంటాయి. లేనట్లయితే జీవితం వ్యర్థం అవుతుంది. జీవనశైలి ఎలా ఉండాలనే విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే 90 శాతం పైగా ప్రజలు తమ తమ జీవన శైలిని సమర్థించుకొంటూ ఉంటారు అనేది అక్షర సత్యం. ఎవరు దేనిని సమర్థించుకున్నా మన జీవనశైలి అనేది మన ఆరోగ్యాలను కాపాడేదిగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా జీవించగలం. ఆరోగ్యంగా జీవించాలంటే రసాయనాలు లేని పంటల ఉత్పత్తులను తినాలి. సేంద్రియ విధానంలో పంటలు పండించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా కంటే ముందు చాలామంది ఆరోగ్యానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇవ్వలేదని చెప్పవచ్చు. చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవితాలను కొనసాగించారని చెప్పవచ్చు. డబ్బు సంపాదన కొరకు తమ ఆరోగ్యాన్ని, కుటుంబాలను పణంగా పెట్టినవారు చాలామంది ఉన్నారు. కరోనా తరువాత చాలామందిలో మార్పు వచ్చింది. ఆరోగ్యం విలువ అందరికీ తెలిసి వచ్చింది. అందుకే చాలా మంది రైతులు సేంద్రీయ వ్యవసాయానికి మక్కువ చూపుతున్నారు.ప్రజలంతా ఆరోగ్యంగా జీవించాలంటే ఆరోగ్యకరమైన రసాయనాలు లేని వ్యవసాయం ఒక్కటే పరిష్కారం.

Also Read: Snake Gourd Cultivation: పొట్ల సాగుతో నిత్య ఆదాయం.!

Organic Farming Health Benefits

Organic Farming Health Benefits

ఆరోగ్యం అనేది మనం తినే ఆహారం, పీల్చే గాలి, శారీరక శ్రమ, మన ఆలోచనలు, మనశ్శాంతి లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం ఎలాంటి విష రసాయనాలు లేకుండా ప్రకృతి సిద్ధంగా పండింది అయి ఉండాలి. పీల్చేగాలి ఎలాంటి కాలుష్యం లేకుండా ఉండాలి. మనం చేసే వృత్తిలో శారీరక శ్రమ ఇమిడి ఉండాలి. విపరీతమై కోర్కెలు పెట్టుకొని అవి ఎలా తీరాలనే ఆలోచనలు లేకుండా ఉండాలి. కుటుంబ సభ్యులు మరియు తోటి సమాజంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనశ్శాంతితో జీవించగలగాలి. వీటన్నింటితో పాటు ఇంకా కొన్ని అంశాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి కాని వాటి పరిష్కారం మన చేతులలో ఉండకపోవచ్చు. మన చేతులలో లేని వాటి గురించి ఎంత ఆలోచించినా ఫలితం ఉండదు. కానీ మనచేతుల్లో ఉన్నటువంటి రసాయన ఎరువులతో పనిలేని సేంద్రీయ సాగు విధానాలను రైతులకు అందించడం తమ ఆరోగ్యాని తామే కాపాడుకున్న నారు ఆవుతారు.

జీవితమంటే ఉన్నత చదువులు చదవడం, మంచి జీతము వచ్చే ఉద్యోగాలు చేయటమో, ఆర్థికంగా బాగా లాభాలు ఉండే వ్యాపారమో లేదా ఇంకేదైనా వ్యాపకము చేయడమో కాదు. వాటివలన ఎవరికి వారు విలాసంవతమైన జీవితాలను అనుభవించవచ్చు కాని తోటి సమాజానికి పెద్దగా ఫలితం లేకపోగా ఈఉరుకుల పరుగుల జీవితములో మనకు తెలియకుండా ఎంతో విలువైన వాటిని కోల్పోవచ్చు. కాబట్టి ఇది సరైన జీవితము కాదు. ఇలాంటి జీవితాలలో విజయం వలన పొందే సంతోషం అందుతుంది. కాని తృప్తిని పొందలేము. ప్రస్తుత సమాజంలో డబ్బు సంపాదన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రకృతిని ఇబ్బంది పెట్టడము లేదా సమాజాన్ని ఇబ్బంది పెట్టడము లేదా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించటం లేదా వృథా చేయడం లాంటివి తప్పనిసరిగా ఇమిడి ఉంటాయి కాబట్టి వీటిలో వాస్తవమైన తృప్తి ఉండదు. నిజమైన తృప్తి పొందాలంటే ప్రకృతి నుంచి తక్కువ తీసుకుని ఎక్కువ ఇవ్వాలి అప్పుడే నిజమైన తృప్తి దొరుకుతుంది

మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూ వస్తుంది. జనాభాతో పాటు నిరుద్యోగుల సంఖ్య కూడా ప్రతి ఏడూ పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా మన దేశంలో వ్యవసాయం, దాని అనుబంధరంగాలకే ఉంది కాని మరే ఇతర రంగాలకు లేదనే విషయం అక్షర సత్యం. కాని ఈవ్యవసాయం, దాని అనుబంధ రంగాలను స్వయం ఉపాధిగా ఎంచుకునే వారు సక్రమంగా ఆదాయం సంపాదించగలుగుతున్నారా? లేదా? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లాభాలు రాకపోయినా పరవాలేదు కాని నష్టాలు రాకూడదు. నష్టాలు వచ్చినట్లయితే అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గతాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించగలవు అనుకున్న అనేక వ్యవసాయ అనుబంధ రంగాల ఔత్సాహికులకు నిరాశనే మిగిల్చాయి.

Also Read: Minister Niranjan Reddy America Visit: మూడవరోజు అమెరికా పర్యటనలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.!

Leave Your Comments

Snake Gourd Cultivation: పొట్ల సాగుతో నిత్య ఆదాయం.!

Previous article

Telangana Govt Schemes For Farmers: రైతులకు భరోసాని ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.!

Next article

You may also like