యంత్రపరికరాలు

Solar Dryer: పంట నిల్వ కోసం సోలార్ డ్రైయర్ కనుగొన్న మెకానికల్ ఇంజనీర్.!

2
Solar Dryer
Solar Dryer for crop storage

Solar Dryer: వ్యవసాయ ఉత్పత్తులను సౌరశక్తితో ఎండబెట్టడం అనేది ప్రపంచ ఆహార సమస్యకు అవసరమైన మరియు అత్యంత ఆచరణీయమైన పరిష్కారం. అనేక శతాబ్దాల నుండి అవలంబిస్తున్న ఆహర నష్టాన్ని తగ్గించడానికి సోలార్ ఎండబెట్టడం ద్వారా ఆహర సంరక్షణ మాత్రమే ఏకైక మార్గం. ఆహార ఉత్పత్తులను ఎక్కువ కాలం భద్రపరచడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఎండబెట్టడం ఒకటి. సూర్యుడి నుండి వచ్చే వేడితో గాలితో ఆహారాన్ని ఆరబెట్టడానికి ఉపయోగిస్తారు. అయితే ఈనేపధ్యంలోముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు.. అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్‌ ఇంజనీర్‌ వరుణ్‌ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టమాటాలు కోసి ధర లేక పొలాల్లో వదిలివేసిన సంఘటనలు, రోడ్లమీద పారబోసిన ఘటనలాంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంటు లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండటానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్ ను రూపొందించారు.

ప్రయోగం విజయవంతం

గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున టమోటాలను తీసుకోని సోలార్ డ్రైయర్ లో పెట్టి తన ప్రయోగాన్ని నిరూపించాడు. యువతలో చదువుతోపాటు జ్ఞానం కూడా సామాజిక మొండుగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రమోగాలు సాద్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేకూరుతుంది. విత్తనం నాటిన దగ్గర నుంటి పంట చేతికి వచ్చేంత వరకు అంతా ప్రకృతి మీద ఆధారపడి ఉంటోది. పంటను, పొలాన్ని పరిరక్షించడంలో కొలవడానికి ఏపరికరము అవసరం ఉండదు. అకాల వర్షాలకు చేతికి వచ్చిన పంట నీటిపాలు అయినప్పుడు అన్నదాతలు అనుభవించే బాధ చెప్పలేనిది. వాళ్ళ భాదలో నుంచి వచ్చిందే ఈ సోలార్ డ్రైయర్.

Also Read: Protection of Crops from the Pests: అధిక వర్షాలతో చీడపీడల బెడద, జాగ్రత్తలు చేసుకోవాలంటున్న శాస్త్రవేత్తలు.!

Vegetable Solar Dryer

 Solar Dryer

వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్

ఈఆలోచనలతోనే మెకానికల్ ఇంజనీర్ గా ఇంటర్నెన్ షిప్ చేస్తున్న సమయంలో ఇవి కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సోలార్ డైయర్ ను రూపొందించడంతో పాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్ తో పాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్ ను కూడా రూపొందించారు. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు.

Also Read: Oil Palm Farmers: టన్ను 23 వేల ఉన్న ధర 13 వేలు అయ్యింది రైతుల ఆవేదన.!

Leave Your Comments

Oil Palm Farmers: టన్ను 23 వేల ఉన్న ధర 13 వేలు అయ్యింది రైతుల ఆవేదన.!

Previous article

Coriander Farming Profit: కొత్తిమీర సాగు తో రూ. కోటి సంపాదన..

Next article

You may also like