యంత్రపరికరాలు

Dry grass Packing Machine: వ్యవసాయంలో కొత్త వ్యాపారం చేస్తూ రెండు నెలలో 30 లక్షలు లాభాలు.!

2
Dry grass Packing Machine
Dry grass Packing Machine

Dry grass Packing Machine: రైతులు వరి పంటని హార్వెస్టర్ ద్వారా కోతలు కోశాక వరి గడ్డిని కొందరు రైతులు అలాగే వదిలేస్తున్నారు. పశులు ఉన్న రైతులు మాత్రం గడ్డిని జాగ్రత్తగా దాచుకుంటున్నారు. హార్వెస్టర్ ద్వారా కట్ చేసిన వరి దాదాపు 10-15 సెంటి మీటర్లు కోయలుగా వదిలేస్తుంది. ఈ గడ్డిని కట్టలుగా కట్టి దాచుకుంటున్నారు. పశువులు ఎక్కువగా ఉన్న రైతులు ఇతర రైతులు లేదా ఇతర ప్రాంతాల నుంచి కూడా గడ్డి కొంటున్నారు. ప్రస్తుతం గడ్డి అమ్మడం కూడా వ్యాపారంగా చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనతో నల్గొండ జిల్లా బొంబైదాయాల కొండల్ గారు వ్యాపారం చేస్తున్నారు.

వరి గడ్డిని అమ్మాలి లేదా కొనుగోలు చేయాలి అనుకున్న రైతులు కొండల్ గారును సంప్రదించి ద్వారా తొందరగా పనులు చేసుకుంటున్నారు. ఈ వ్యాపారం 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఒక ఎకరంలో వరి గడ్డికి 50-60 గడ్డి రోల్స్ వస్తాయి. గడ్డి రోల్ చేసే యంత్రంతో రోల్ చేసి అమ్ముతున్నారు.

Also Read: Farm Embankment: ఇలా చేయడం వల్ల పొలం గట్టు ఎక్కువగా దున్నకుండా ఉంటారు..

Dry grass Packing Machine

Dry grass Packing Machine

ఇప్పుడు దేవరకొండ, డిండి మొదలు అయిన ప్రాంతాల్లో సప్లై చేస్తున్నారు. దేవరకొండకి సప్లై చేయాలి అంటే ఒక రోల్ 130 రూపాయలకి అమ్ముతున్నారు. మద్దిమడుగు ప్రాంతంకి సప్లై చేయాలి అంటే ఒక గడ్డి రోల్ 180 రూపాయల ఖర్చు అవుతుంది. ప్రాంతాన్ని బట్టి రేట్ మారుతుంది.

గడ్డి కొనుగోలు చేయాలి అనుకున్న వారికి సొంతగా వాహనం ఉండి, దాని ద్వారా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే రేట్ తగ్గింది అమ్ముతున్నారు. ఈ గడ్డి అమ్ముకునే రెండు నెలల కాలంలో పెట్టుబడి మొత్తం పోయాక దాదాపు 30 లక్షలు లాభాలు వస్తున్నాయి. ఈ రైతు నుంచి మీరు గడ్డి కొనుగోలు లేదా అమ్మాలి అనుకుంటే 8008286245 నెంబర్ సంప్రదించండి.

Also Read: Bucket Sprayer: హ్యాండ్ లేదా బక్కెట్ స్ప్రేయర్ ఎలా వాడాలి..

Leave Your Comments

Bucket Sprayer: హ్యాండ్ లేదా బక్కెట్ స్ప్రేయర్ ఎలా వాడాలి..

Previous article

Machi Patri Cultivation: ఒకసారి వేసుకుంటే 10 సంవత్సరాలు సులువుగా సాగు చేసే ఈ పంటతో నెలకి 20 వేలు లాభాలు ఎలా… ?

Next article

You may also like