Indian Oats Farming: రైతులు మన పూర్వికులు పండించే పంటలు చాలా వరకు పండించడం లేదు. కొని పంటలకి ఎలాంటి ఆనవాలు లేక పండించకపోతే, మరి కొని వాటికీ విత్తనాలు లేక పండించడం లేదు. ఇలా మంచి పోషక విలువలు ఉన్న పంటలు కూడా అంతరించి పోతున్నాయి. అంతరించి పోతున్న పంటలో యవ్వల పంట ఒకటి. ఈ యవ్వల పంటలో చాలా పోషక విలువలు ఉండటంతో ఈ పంట పండించడం సంగారెడ్డి జిల్లా సైయద్ రైతు మళ్ళీ మొదలు పెట్టారు.
యవ్వల పంటని ఇండియన్ ఓట్స్ అని కూడా అంటారు. ఈ పంట కొంచం గోధుమల పంటల ఉంటుంది. కానీ గోధుమల పంట కంటే ఎత్తుగా పెరుగుతుంది. ఈ యవ్వల పంటని సైయద్ రైతు గారు మళ్ళీ గత రెండు సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. వీటిలో మంచి పోషక విలువలు ఉండటంతో వాళ్ళ ఇంటికి ఉపయోగించుకోవడానికి మాత్రమే పండిస్తున్నారు.
ఈ పంట సాగు చేయడానికి విత్తనాలు ఇంటర్నెట్ సహాయంతో కర్ణాటక రైతు దగర నుంచి కొన్నుకున్నారు. ఈ పంటని సేంద్రియ పద్దతిలో పండిస్తున్నారు. యవ్వల పంటకి ఎలాంటి చీడ పురుగులు, వ్యాధులు రావు. దాని వల్ల ఈ పంటకి ఎలాంటి పరుగుల మందులు, రసాయన ఎరువులు వేసుకోవాల్సిన అవసరం లేదు.
Also Read: Make Compost at Home: కంపోస్ట్ సులువుగా ఎలా తయారు చేసుకోవాలి… ?
యవ్వల పంటకి 8 తడులు నీళ్లు ఇవ్వాలి. నేల తీరుని బట్టి నీళ్లు ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి పంటకి వేరు వేరు నేలలో పండిస్తే మంచి దుగుబడి వస్తుంది. ఈ పంటకి వరి పంటల విత్తనాలు వేసుకోవాలి. యవ్వల పంటకి 20 కిలోల విత్తనాలు వేస్తే 4 క్వింటాల్ దిగుబడి వస్తుంది. ఒక కిలో విత్తనాలు 55-60 రూపాయల ధర ఉంది.
యవ్వల పంట పండించడానికి విత్తనాలు దొరకడం చాలా తక్కువ. పండించిన పంటలో కొంత భాగం విత్తనాల కోసం దాచుకొని మళ్ళీ పంటలో విత్తనాలుగా వేసుకోవాలి. ఈ యవ్వలని రొట్టెలు, రవ, అన్నంల తిన్నవచ్చు. ఈ యవ్వలలో పాలలో కంటే 10 రేట్లుల పోషకాలు ఎక్కువగా ఉంటుంది.
యవ్వల పంటని వరి, గోధుమలు కోసే హార్వెస్టర్ సహాయంతో కోయాలి. ఈ పంట కాలం నాలుగు నెలలు. యవ్వలని ఎక్కువగా నవంబర్ నెలలో వేసుకుంటారు. ఈ పంటలో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ఈ పంట గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఈ రైతు యవ్వలతో పాటు గోధుమలు, ఉలిపాయలు, కూరగాయలు కుసుమాలు పండిస్తున్నారు. ఇతని దగరలో ఉన్న వారికి పంటని అమ్ముతున్నారు. ఈ యవ్వల పంట విత్తనాలు కావాలి అనుకున్న వారు ఈ రైతు నుంచి తీసుకోవచ్చు. ఈ పంట కోసం సైయద్ గారిని 8328139893 సంప్రదించవచ్చు.
Also Read: Jasmine Farming:ఈ పువ్వుల తోటతో మంచి లాభాలు..