PM Kisan Samman Nidhi: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకమైన “ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన” అనే స్కీమ్ అందుబాటులో ఉంచిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పథకానికి అర్హులైన వారికి మోదీ ప్రభుత్వం ఏటా రూ. 6 వేలు అందజేస్తుంది. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల వారీగా రూ. 2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అంటే ఏటా నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేల చొప్పున మూడు సార్లు అన్నదాతల పెట్టుబడి ఖర్చులకు కేంద్రం డబ్బులు అందజేస్తుంది.
ఇలా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే రైతులు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. కొంతమంది రైతులు అర్హతలు లేకపోయినా కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందుతున్నారు, అలాంటి వారిపైన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఎవరైతే అర్హత లేకపోయినా కూడా ఈ స్కీమ్ కింద డబ్బులు పొందుతున్నారో.. వారి నుంచి కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆ డబ్బులను వెనక్కి తీసుకోనుంది. అంతే కాకుండా ఒకే కుటుంబంలో ఒకరి కన్నా ఎక్కువ ఈ స్కీమ్ కింద డబ్బులు పొందుతున్నట్టయితే, వారు కూడా కేంద్రానికి ఈ డబ్బులు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
“ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన” స్కీమ్ కింద ఒక కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే రూ. 2 వేలు లభిస్తాయి, మిగతావారికి డబ్బులు రావు. కావున ఇలాంటి సందర్భాలలో, ఒకవేళ డబ్బులు వెనక్కి ఇవ్వక్కపోతే అప్పుడు జైలుకి కూడా పంపించే అవకాశం ఉంటుంది. ఇటీవల ఛత్తీస్‌గడ్‌లో దాదాపుగా 50 వేల మందికి పైగా అర్హత లేని వారు పీఎం కిసాన్ డబ్బులు పొందినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఇలా అర్హత లేకున్నా కూడా డబ్బులు పొందిన వారిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి, వారిని డబ్బులు తిరిగి ఇవ్వమని కోరింది. డబ్బులు చెల్లించిన తర్వాత వీరి పేరును పీఎం కిసాన్ పోర్టల్ నుంచి తొలగించడం జరుగుతుంది. వీరితో పాటు కొందరు ఫేక్ డాక్యూమెంట్ల ద్వారా కూడా ఈ స్కీమ్ కింద డబ్బులు పొందుతున్నారు, అలాంటి వారిని కూడా కేంద్రం గుర్తించి, డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే జైలు పాలవుతారని హెచ్చరించింది. కావున మీరు ఈ ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద డబ్బులు పొందటానికి అర్హులు కాకపోతే, దీనికి దూరంగా ఉండడం మంచిది.
Also Read: PM Kisan Scheme: PM కిసాన్ పథకానికి మీరు అర్హులేనా? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి..!