పుదీనా మనకు సీజన్ సంబంధం లేకుండా 365 నిత్యం అందుబాటులో వుండే ఒక ఆకుకూర చెప్పవచ్చు. సాధారణంగా చాలామంది పుదీనాను వంటలో ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా పుదీనాను ఎక్కువ పరిమాణంలో వాడకుండా తగిన పరిమాణంలో మాత్రమే వాడుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే పుదీనాను ప్రతిరోజు మన ఆహార పదార్థంలో తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో పుదీనా తీసుకోవడం వల్ల మన శరీరానికి తగినంత వేడిని అందిస్తుంది. అదేవిధంగా వేసవిలో మన శరీరానికి ఉపశమనం కలిగిచడానికి పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.
పుదీనా ఆకులలో ఎక్కువగా యాంటీఇన్ఫలమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సీడెంట్లు అధికంగా ఉంటాయి. కడుపులో ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, నెలసరి సమయంలో ఏర్పడినటువంటి నొప్పులను తగ్గించడంలో ఈ పుదీనా ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి. మానసిక కారణంగా తలెత్తే సమస్యలను, తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బాలింతలు ఎక్కువగా పుదీనాను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు అవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ వేసవిలో మన శరీరం వేడి నుంచి ఉపశమనఁ పొందడానికి పుదీనా జ్యూస్ లను కూడా తాగుతారు. ఈ విధంగా పుదీనా జ్యూస్ తాగటం వల్ల మన శరీర వేడిని తగ్గిస్తూ మనకు ఉపశమనం కలిగిస్తుంది. రోగ నిరోధక శక్తి మెరుగు పడాలంటే పుదీనా తప్పనిసరిగా ఉపయోగించాలి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు పుదీనా టీ తాగడం వల్ల ఆ సమస్యలకు చక్కటి పరిష్కారమని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా నిత్యం పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పుదీనా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments