ఆంధ్రా వ్యవసాయం

పొగాకులో సస్యరక్షణ – వాడవలసిన మందులు..

0

పొగాకు పంటపై చీడపీడల నివారణకు రసాయన మందులను విచక్షణా రహితంగా వాడటం వల్ల క్యూరుచేసిన పొగాకులో పురుగుమందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి. పొగ తాగేవారికి ఈ అవశేషాలు అత్యంత హానికరమైనవి. పొగాకులో అవశేషాలు పరిమితికి మించి ఉంటే, ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ విపణిలో ఎలాంటి ఒడిదుడుకులైన తట్టుకొని పొగాకు ఎగుమతులను గణనీయంగా పెంచేందుకు రైతులు సస్య రక్షణ యాజమాన్యంలో మెళుకువలు పాటించాల్సివుంది.
పొగాకు సాగులో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఏడాది అన్ని వేలంకేంద్రాల్లో ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులతో రసాయన ఎరువులను వినియోగించకుండా పొగాకు సాగు చేపట్టినట్లు చెప్పారు. పొగాకు పంటలో అన్యపదార్థాలు, రసాయన మందులు లేకుండా పంట ఉత్పత్తి చేస్తే రైతులకు మంచి ధరలు లభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మందులు:
ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్), ఇమామెక్టిన్ బెంజోయెట్(ప్రొక్లెయిమ్), ఫ్లూబెండమైడ్(ఫేమ్), థయామిథాక్సామ్(ఆక్టారా), వేపమందులు, కానుగ పిండి, ఎన్.పి. వి. ద్రావణం.
వాడకూడని మందులు:
ఎండోసల్ఫాన్ , ప్రోఫినోఫాస్, ఎసిఫేట్, క్లోరోఫైరీఫాస్, మోనోక్రోటోఫాస్, క్వినాల్ ఫాస్, ఫెన్ వలరేట్, లిండేన్, పొడి మందులు.
పొగాకులో మందుల అవశేషాలు లేకుండా ఉండాలంటే వీలయినంత వరకు మందుల వాడకాన్ని తగ్గించడం అన్నింటికన్నా ముఖ్యం. ఇతర సస్యరక్షణ పద్ధతులైన ఎర పంటలు, కంచె పంటలు, వేప, కానుగ మందులు, ఎన్ పి వి వాడకం తప్పనిసరి. పంట ఆర్ధిక నష్ట పరిమితి స్థాయి దాటినప్పుడు మాత్రమే పురుగు మందులను వాడాలి. నిషేధించిన మందులను, పొడి మందులను, గుళిక మందులను పొగాకులో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. పురుగు మందులు చల్లేందుకు సరైన నాణ్యతా ప్రమాణాలు గల స్ప్రేయర్లనే వాడాలి. సిఫారసు చేసిన మందులనే ఉపయోగించాలి.

Leave Your Comments

పుట్టగొడుగుల వలన ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

శనగపంట కోత – నిల్వ చేయు విధానం

Next article

You may also like