Yasangi Rice Cultivation: తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన ఆహారపంట, ఖరీఫ్లో కన్నా రబీ (దాళ్వా/ యాసంగి) వరిలో దిగుబడులు వచ్చేందుకు వీలుంటుంది. వాతావరణ పరి స్థితులు అనుకూలంగా ఉండి, నీటి యాజమాన్యం మన ఆధీనంలో ఉండ టమే దీనికి కారణం.
యాసంగి లో నీటి లభ్యత ఆధారంగా ఎంపిక చేసుకొని సరైన సాగు పద్ధతులు పాటిస్తే అధికదిగుబడులు సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మార్చి 30 లోగా కోతకు వచ్చేవిధంగా 120-125 రోజుల కాలపరిమితిగల రకాలను నవంబరు 15 నుంచి డిసెంబరు 15 లోగా నారుమళ్లు పోసుకోవాలి. డిసెంబరు-జనవ వీరిలో వరినాట్లు వేయాలి. రబీలో అగ్గితెగులు, దోమపోటును సమర్థంగా తట్టుకొని చేను పై పడిపోని రకాలను సాగుకు ఎంచుకోవడం మేలు. ఈ కాలను నేరుగా వెదజల్లే పద్ధతిలో కూడా సాగుచేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో రబీలో సాగుకు కాటన్ దొరసన్నాలు, చంద్ర, తరంగిణి, శ్వేత, ఐ.ఆర్ -64, సోమశిల వంటి 120 రోజుల పంటకాలం గల రకాలు, నెల్లూరు మసూరి, శ్రీధృతి విజేత, జగిత్యాల సన్నాలు, ప్రభాత్ వంటి 125 రోజుల కాలపరిమితి రకాలు ఎంచుకోవాలి. ఎంపిక చేసుకున్న రకాన్ని బట్టి ఎక రాకు 25-35 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. తెలంగాణలో రబీలో సాగుకు తెలం గాణాసోనా, బతుకమ్మ కూనారం సన్నాలు, కాటన్ దొరసన్నాలు, ఐ.ఆర్. 64. జగిత్యాల సన్నాలు, నెల్లూరు మసూరి, తెల్లహంస, శీతల్, ప్రద్యుమ్న, ఎర్ర మల్లెలు, అంజన వంటి స్వల్పకాలిక రకాలు ఎంపిక చేసుకోవచ్చు. సీజన్లో ఉండే చలి తీవ్రతను బట్టి రబీలో సాగుచేసే వరి రకాలు 15-30 రోజులు పంటకొస్తాయి.
విత్తనాల శుద్ధి: సార్వా పంట నుంచి సేకరించిన విత్తనాన్ని వెంటనే దాళ్వాకు వాడాల్సివస్తే వాటిలో నిద్రావస్థను తొలగించి నాణ్యమైన విత్తనం ఎంచుకోవాలి. విత్తనాల్లో నిద్రావస్థను తొలగించేందుకు లీటరు నీటికి 6.3 మి.లీ. గాఢనత్రి కామ్లం (విజేత వంటి ఎక్కువ నిద్రావస్థగల రకానికైతే 10. మి.లీ.) కలిపి 24 గంటలు నానబెట్టి తర్వాత 24 గంటల పాటు మండె కట్టుకోవాలి. కనీసం 80 శాతం గింజల్లో మొలకవస్తేనే విత్తనంగా వాడుకోవాలి. లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కార్బెండాజిమ్ కలిపిన మందు ద్రావణంలో 24 గంటల పాటు విత్తనాలు నానబెట్టి, మరో 24 గంటలు మండె కట్టి నారు పోసుకోవాలి.
Also Read: Rice Stem Borer: వానాకాలం లో వరి కాండము తొలుచు పురుగు ఇలా నివారించండి.!
నారుమడి తయారిలో: దాళ్వాలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నారు సక్రమంగా ఎదిగేందుకు భాస్వరం ఎరువును సిఫారసు చేసిన దానికన్నా రెట్టింపు వేయాలి. 5 సెంట్ల నారుమడికి 12.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ 2.2కిలోల యూరియ, 178. మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేయాలి. పైపాటుగా విత్తిన 10-15 రోజులకు మరో 2.2కిలోల యూరియ వేయాలి. సెంటుకు 53కిలోల చొప్పున మొలక కట్టిన విత్తనం చల్లాలి. నారు ఒక ఆకు పూర్తిగా బయటకొచ్చేవరకు ఆరుతడి పద్ధతిలో నీరు పెట్టాలి. దాళ్వాలో జింకు లోపనివారణకు జింకు సల్ఫేట్ (2గ్రా./లీ.) పిచికారి చేయాలి. నారు మడి పోసిన 10 రోజులకు మోనోక్రోటోఫాస్ (1.6మి.లీ./లీ.) లేదా క్లోరిఫైరి పాస్ (2. మి.లీ./లీ) పిచికారి చేయాలి లేదా నారు తీతకు వారంరోజుల ముందు సెంటునారు మడికి 160గ్రా. చొప్పున కార్బోప్యూరాన్ గుళికలు ఇసు కలో కలిపి పలుచగా నీరుంచి చల్లుకోవాలి. దీనివల్ల కాండం దొల్చుపురుగు | ప్రధాన పొలంలో 15 రోజుల పాటు రాకుండా చేసుకోవచ్చు.
ప్రధాన పొలం తయారీ: చాలా మంది రైతులు యంత్రంతో వరి కోతల తర్వాత గడ్డిని కాల్చివేస్తున్నారు. దీనివల్ల మేలుచేసే పోషకాలు కూడా కోల్పోవడమే గాక బొగ్గుపులుసు వాయువు విడుదలై వాతావరణం కలుషిత మవుతుంది.సార్వా తర్వాత యంత్రంతో కోసిన గడ్డిని తగల బెట్టకుండా చేలో పలుచగా చల్లి కలియబెడితే ఎకరానికి వచ్చే గడ్డి ద్వారా 12 కిలోల నత్రజని, 5 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ ఎరువులు నేలలో తదుపరి పంటకు అందుబాటులో ఉంటాయి. త్వరగా కుళ్లటానికి దాళ్వాలో ఎకరానికి 200 కిలోల భాస్వరంతో పాటు 10 కిలోల యూరియా కలిపి నీరు నిలబెట్టాలి. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే 2-3 దఫాలుగా గడ్డి మరిగేలా దమ్ము చేయాలి. వెదజల్లడం, యంత్రంతో నాటుటకు నేలను తప్పనిసరిగా చదును చేసుకోవాలి. సరిగా దమ్ము చేయకుండా నాటితే మూనవేగంగా తిరగదు.
Also Read: Pests Control In Rice Crop: వరి పంటలో తెగుళ్ళు, లక్షణాలు, నివారణ.!
Also Watch: