పశుపోషణ

Winter Nutrition for Cattle: చలికాలంలో దూడల పోషణ యాజమాన్యం.!

0
Winter Nutrition for Cattle
Winter Nutrition for Cattle

Winter Nutrition for Cattle: సాధారణంగా చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల విపరీత మైన చలి, చలిగాడ్పులతో దూడలు అనారోగ్యానికి గురవుతాయి. ఫలి తంగా వాటి శరీరంలో మార్పులు జరుగుతుంటాయి.

వసతి: దూడలను విపరీతమైన చలి, చలి గాడ్పుల నుంచి కాపాడుకోవడానికి వెచ్చని నివాస వసతిని కల్పించాలి. ముఖ్యంగా రాత్రిపూట దూడలను షెడ్ల లోనే ఉంచాలి. పాకలకు ఇరువైపులా గోనె పట్టాలను వేలాడ దీయాలి. పాకల్లో నేలపై రాత్రిపూట వరిగడ్డిని పరిచినట్లయితే వెచ్చగా ఉంటుంది, పాకల్లో వెచ్చదనాన్ని కల్పించుటకు, ఉష్ణోగ్రతను పెంచడం కొరకు రూమ్ హీటర్స్ను అమర్చుకోవాలి.

Winter Nutrition for Cattle

Winter Nutrition for Cattle

మేపు: దూడలకిచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవుదూడ శరీర బరువులో పదోవంతు పాలను, గేదె దూడలకు పదిహేనవ వంతు పాలను తాగించాలి. రెండు నెలల వయస్సు గల దూడలకు ప్రత్యేకంగా తయారు చేసిన కాప్ స్టార్టర్ను దాణాగా ఇవ్వాలి. దూడ లకు మొదటి మూడు నెలలు మాత్రమే పాలను తాగించాలి.

Also Read: Milking Methods in Dairy Cattle: పాడి పశువులలో పాలు పిండు పద్ధతులు

దూడ పుట్టిన రెండు వారాల తర్వాత నుంచి పశుగ్రాసాలు, మేపడం అలవాటు చేయాలి. దాణాను దూడలకు ఇచ్చేదాణాలో మాంసకృ త్తులు ఎక్కువగా ఉండే పీచు పదా ర్థాలు తక్కువగా ఉండాలి. దాణాను దూడలకు మేపడంవల్ల దూడలు ఆరోగ్యంగా ఉండి శరీర బరువు పెరుగుతుంది. దూడల దాణాలో రెండు శాతం ఖనిజ లవణ మిశ్ర మాని, ప్రతి 100 కిలోల దాణాలో 10 గ్రా. విటమిన్ ఎ, డి లను కలపాలి.దూడలకు ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇవ్వడం వల్ల దూడలు ఆరోగ్యంగా ఉండి శరీర బరువు పెరుగుతుంది.

ఆరోగ్య పరిరక్షణ: దూడలు చలికాలంలో న్యూమో నియా వ్యాధికి గురై మరణిస్తుం టాయి. దూడలు చలిగాడ్పులకు గురైతే న్యూమోనియా వ్యాధిసోకే ప్రమాదముంది. కాబట్టి దూడలకు చలి గాడ్పులు తగలకుండా పాకల్లో తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. పాకలను శుభ్రంగా ఉంచి గాలి, వెలు తురు పాకల్లో సరిగా ఉండేలా చూడాలి. దూడల్లో నట్టల బెడద మూలంగా సరిగా పెరగకపోవడమే కాకుండా తరుచుగా విరేచనాలకు గురవుతుంటాయి. కాబట్టి దూడలకు నట్టల నివారణ మందులను తాగిం చాలి. దూడలు బొడ్డువాపు, విరేచనాలు, కడుపుబ్బడం మొదలగు వ్యాధులకు గురైతే వెంటనే చికిత్స చేయించాలి. దూడలు వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి పుట్టిన మొదటి రోజున టెర్రామైసిన్ పొడిని పాలలో కలిపి తాగిస్తే దూడలు విరేచనాలకు గురికాకుండా ఉంటాయి.

Also Read: Lumpy Skin Disease in Cattle: లంపీ స్కిన్‌ వ్యాధి లేదా ముద్ద చర్మ వ్యాధి.!

Also Watch: 

Leave Your Comments

Sugarcane Harvester: యంత్రాలతో చెరకు కోత ఎంతో మేలు.!

Previous article

Vannamei Prawn Cultivation: వెన్నామి రొయ్యల సాగు లో మెళుకువలు.!

Next article

You may also like