Cultivation of sugandaraja and Rose geranium: సుగంధ పరిమళాలు వెదజల్లే మొక్కలు అనేకం. కానీ రోజ్ జేరినియం మొక్క ప్రత్యేకత వేరు. సుగంధ పరిమళాలు వెదజల్లడమే కాకుండా ఔషధంగానూ ఉపయోగపడుతుంది. అనిర్వచనీయమైన సుగంధ పరిమళాలను వెదజల్లె మొక్కల్లో ఈ హెర్బకు ప్రత్యేక స్థానం ఉంది. పన్నీర్ పత్రిగా పిలిచే ఈ మొక్క నుంచి తీసిన వాలటైల్ తైలాలను ఆరోమా, వేపర్‌ధేరపీలోనూ, ఔషధాలలో, ఆత్తర్లలో విరివిగా వాడుతారు. సెంటెడ్ జెరీనియంలు వాతావరణ అనుకూలతను బట్టి పుష్పిస్తాయి. జెరీనియం తైలంలోని ఆర్గానిక్ రసాయనాలలో ముఖ్యమైనవి. జెరానియం, సిట్రోనెల్లాల్, ఫెనీన్‌లు, టెర్‌పైనీన్, మైర్‌సిన్, లిమోనీన్, మెంథోన్, జెరానిల్స్ వంటి కాంపౌండ్ల వల్ల ఈ తైలానికి సువాసనలు, ఔషధ గుణాలు వస్తాయి. ప్రధానంగా రోడినాల్ అనే కాంపోనెంట్ వల్ల తైలానికి అద్భుతమైన ఘాటైన సువాసనలు కలిగి ఉంటుంది.
జెరేనియం తైలాల ఉపయోగాలు :
1. దీని తైలాలు చర్మ సమస్యలైన దురద, గజ్జి, పొక్కులకు ఔషధంగా ఉపయోగపడుతాయి. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తాయి.
2. స్త్రీలల్లో నెలసరి సమస్యలు రాకుండా నియంత్రించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
3. ఆహార పదార్ధాలు, పానీయాలకు ఆకర్షణియమైన రుచులు, సువాసనలు జోడిరచుటకు విసృతంగా ఉపయోగపడతుంది.
4. మూత్ర విసర్జన సాఫిగా జరిగేలా చేస్తూ మూత్ర పిండాలు, గాల్‌బ్లాడర్ సమస్యలను అధిగమించేలా చేస్తుంది.
5. దోమలు, ఇతర కీటకాల రీపేల్లెంట్ ఉత్పత్తులలో దీని వాలటైల్ ఆయిల్స్ వినియోగం ఉంది.
6. తలలోని పేల భాద నుండి ఉపశమనాన్ని ఈ హెర్బ్ నుండి తీసిన తైలాలు అందిస్తాయి.
7. రక్త ప్రసరణ లోపాలను, జీర్ణాశయ సమస్యలను దూరం చేస్తుంది.
8. దేహానికి, మనస్సుకి అనిర్వచనీయమైన ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని అందిస్తుంది.
9. దీని తైలం ఆరోమా థేరపీ, వేపర్ థేరపీలలో, మసాజ్ ఆయిల్‌గా, ఆరోగ్యం సంరక్షణలో ఉపయోగపడతుంది.
10. శరీర అవయవాల పనితీరును ఒక క్రమ బద్ధ మార్గంలో బ్యాలెన్స్‌గా ఉండేందుకు దోహదపడుతుంది.
జెరేనియం వివిధ వాతావరణ పరిస్ధితులలో పెరుగుతుంది. ముఖ్యంగా తక్కువ తేమ, ఉష్ణోగ్రత 5`230 సెల్స్‌యస్, ఉన్న ప్రాంతాలు చాలా అనుకూలం. ఈ పంట అధికవేడిని తట్టుకోదు. దీనిని ఎక్కువగా సుగంధ పరిమాళ ద్రవ్యాలు తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు సబ్బుల తయారీలో వాడుతారు.
మొక్కల లక్షణాలు : ఈ మొక్క సుమారు మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. దీని మొక్క కాండము గట్టిగా ఉండి, సన్నని నూగు కలిగి లేతగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగు ముదిరిన తరువాత మట్టి రంగు వస్తుంది, కాండం వెడల్పు, ఆకులలో 5`7 భాగాలు ఉన్నట్లు కనిపిస్తుంది. పుష్పాలు గులాబీ రంగును కలిగి ఉంటాయి. దీని మొక్క ఆకులు ఎక్కువ సువాసనని కలిగి ఉంటాయి.
నేలలు : జెరేనియం సాగుకు బాగా నీరు ఇంకే భూములు, ఎర్ర నేలలు అనుకూలం, నల్లరేగడి భూములల్లో ఈ పంటలు పండవు. మొక్కల వరుసల మధ్య 60 సెం.మీ వరుసలలో మొక్కల మధ్య 4`5 సెం.మీ.లు నాటుకోవాలి. ఎకరాకు సుమారు 15,000 మొక్కలు అవసరం. జెరేనియంను చలికాలంలో నాటుటకు అనుకూలం. ముందుగా తయారు చేసుకున్న వేర్లు వచ్చిన కొమ్మలను మాత్రమే నాటుకోవాలి. నవంబరు చివరి వారం నుండి జనవరి మొదటి వారం వరకు అనుకూలం. ఎకరాకు 6`8 టన్నుల పశువుల ఎరువు వేయాలి. మొక్కలు నాటిన వెంటనే నీటి తడులివ్వాలి. నీటిని ఒక నెల వరకు ప్రతి మూడు రోజులకు ఒకసారి నీరు ఇవ్వాలి. తరువాత వారం వ్యవధిలో వాతావరణాన్ని బట్టి నీరు ఇవ్వాలి. మొక్క నాటిన 2`3 నెలల వరకు పంటల్లో కలుపు లేకుండా జాగ్రత్తపడాలి.
Also Watch: Neelakurinji Flowers: 12 ఏళ్లకు ఓసారి మాత్రమే వికసించే పువ్వులు
పంట కోత సమయం : పంట నాటిన 5`6 మాసాల తరువాత పంట మొదటి కోతకు వస్తుంది. తరువాతి పంట కోతలు 3 మాసాలకు ఒకసారి తీసుకోవచ్చును. ఈ విధంగా పంటను 2`3 సంవత్సరాల వరకు లాభదాయకంగా తీసుకోవచ్చును. దీనిలో ఆకులు ముఖ్యమైన భాగంలో, లేత ఆకులలో ఎక్కువ తైలం ఉంటుంది, ఆకులు క్రింది భాగంలో పసుపు రంగులో మారటం, పూత మొదలు కావటం, ఆకులు గులాబీ మరియు నిమ్మ వాసన కలిగి ఉండటం మొదలైనప్పుడు కోత కోయాలి. మబ్బు, వర్షంలో కోయరాదు. పంట కోసేటప్పుడు మొక్కల కుదుళ్ళను కదలకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కలను పూర్తిగా నేలమట్టంగా కోయరాదు. ఇలా తీసిన ఆకుల నుండి స్టీమ్ డిస్టిలేషన్ పద్ధతి ద్వారా నూనె తీస్తారు. తాజాగా కోసిన పంటను యంత్రంలో వేసి నూనెను కండెన్సర్ పద్ధతి ద్వారా వేరుపర్చాలి.
భద్రపరిచే విధానం : నూనెలో నీరు ఇతర పదార్ధాలు లేకుండా జాగ్రత్తగా చూసి గాజు సీసాలలో భద్రపరచాలి. దీని ఆకుల నుండి 0.06 ` 0.16 % వరకు నూనె లభిస్తుంది. నూనెలో ముఖ్యంగా సిట్రోనెల్లాల్ మరియు జిరేనిమాల్ అనే పదార్ధాలు ఉంటాయి. తైలంలో 60`70 % ఆల్కహాల్ మరియు 20`30 % ఎస్టర్స్ ఉంటాయి.
-జి. శైలజ, ఉధ్యాన విభాగం, డిడియస్ కెవికె, ఫోన్ : 8179088347
Also Read: Sunflower harvesting: ప్రొద్దు తిరుగుడు పంట కోత సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
Also Watch: