వ్యవసాయ పంటలు

Maize(Corn) Products and Varieties: మొక్క జొన్న ఉప ఉత్పత్తులు మరియు రకాలు.!

1
Maize(Corn) Products and Varieties
Maize(Corn) Products and Varieties

Maize(Corn) Products and Varieties:

  • మొక్క జొన్న ఆకులు, కాండం , సైలేజ్ గాను, పేపర్ తయారీలో నూ రాపింగ్ (wrapping ) ఎండిన  తర్వాత మొత్తం మొక్క వంట  చెరకు  గాను సాయిల్ కండిషనర్ గాను ఉపయోగపడుతుంది.
  • మొక్క జొన్న ఈ దశ  లోనైనా పశువుల  మేతగాను, పూత దశలో  కాయకూర గాను , పాలు పోసుకొనే దశలో  కాల్చి తినే కండె గాను, గింజ  ముదిరిన తర్వాత అనేక  రకాల  పరిశ్రమల్లో  ముడి సరుకుగా  వాడబడుతుంది.
  • విత్తనం  పశువుల కోళ్ళ దాణా గా, బిస్కెట్ మరియు బేకరీలో  వాడబడుచున్నవి.
Types of Corns

Types of Corns

  • గింజ నుండి స్టార్చి, గ్లూకోజ్, సుక్రోజ్, డెక్స్తరోజ్, సెల్యులోజ్, గమ్స్ మొదలైన  రసాయన పదార్ధాలు  తయారు చేయవచ్చు.
  • మొక్క జొన్న నుండి ఆల్కహల్, ఇథనాల్, వంటి రసాయన  పదార్ధాలు  తయారు  చేయవచ్చు.
  • మొక్క జొన్న నూనెను అనేక  దేశాల్లో పంట నూనెగా వాడుచున్నారు. ఇది  హృదయ సంబంధిత రోగాలకు మంచిది . ఈ నూనెలో లినోలిక్, మరియు ఒలియిక్ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. కోలస్ట్రాల్ తక్కువగా  ఉంటుంది.
  • కార్న్ ఫ్లాక్స్, సూప్ మిక్స్, ఇన్ స్టాంట్ కార్న్స్, పఫ్స్, ఉప్మా మిక్స్, కేసరి బాదం….. మొదలైన అనేక  కారపు తీపి పిండి పదార్ధాలు  తయారు  చేసుకోవచ్చు.

Also Read: Corn Oil Health Benefits: మొక్కజొన్న నూనెతో ఆరోగ్యం మిన్నా!

మొక్క జొన్న రకాలు:

  • DHM-103 దీని పంట కాలం  105-120 రోజులు కొమ్మ కాండం కుళ్ళు తెగులును తట్టుకోగలదు. దిగుబడి ఎకరానికి 22-25 క్వి వస్తుంది.
  • DHM – 105  దీని పంట కాలం  105-120   ఆకు మాడు, ముక్కు కుళ్ళు తెగుళ్లను నివారిస్తుంది. స్థిరమైన  అధిక  దిగుబడి ని ఇచ్చును.
  • DHM- 1  ఇది స్వల్ప కాలిక హైబ్రిడ్, ఆకు మాడు తెగులును సమర్ధవంతంగా నివారిస్తుంది. పంట కాలం 85-90 రోజులు దిగుబడి 18-20 క్వి వరకు వస్తుంది.
  • DHM-107 పంట కాలం  88-95 రోజులు ఇది మధ్య కాలిక  హైబ్రిడ్, సంకర  జాతి  వంగడం దిగుబడి 22-25 క్వి. దిగుబడి వస్తుంది.
  • DHM – 109 పంట కాలం 85-90 రోజులు దిగుబడి  22-25 క్వి / ఏ.
  • త్రిసులత దీని పంట కాలం  105-120 డేస్ మొక్క కుళ్ళు తెగులును తట్టుకోగలదు. దిగుబడి  ఎకరానికి  25-30క్వి వరకు వస్తుంది.
  • అశ్విని, హర్ష, వరుణ్ ఈ రకాలు వర్ష ధార  పరిస్థితులకు అనుకూలం, మేలైన  అధిక  దిగుబడి  ఇస్తుంది.18-20 క్వి. పంట కాలం 90-100 రోజులు.
  • అంబర్ పాప్ కార్న్ ఈ రకం పేలాలు చేయడానికి అనుకూలం పంట కాలం  95-100 రోజులు. మరియు దిగుబడి 18-20 క్వి వరకు వస్తుంది.
  • మాధురి రకం 65-70 రోజుల పంట కాలం. తీపి కండె  రకం  30-35% చెక్కెర  కలిగి , ఉడికించి  తినుటకు అనుకూలం. దిగుబడి ఎకరకు 30-35 క్వి కండే వరకు వస్తాయి.
Maize(Corn) Products and Varieties

Maize(Corn) Products and Varieties

  •  ప్రియా స్వీట్ కార్న్ ఈ రకం  30-35 వేల  పచ్చి కండెలు దిగుబడి వస్తుంది. పంట కాలం 70-74 రోజులు తీపి కండె  రకం  30-35% చక్కెరతో  ఉడికించి  తినుటకు అనువైనవి . కండె  పరిమాణం  మాధురి రకం కంటే పెద్దదిగా ఉంటుంది. 

Also Read: Sweet Corn Cultivation: తీపిజొన్న సాగులో పాటించవలసిన ముఖ్యమైన మెళకువలు.!

Must Watch:

Also Watch:

Leave Your Comments

Safflower Crop Cultivation: కుసుమ పంట సాగు.!

Previous article

Prevent Sucking Pest of Cotton: ప్రత్తి లో రసం పీల్చు పురుగుల నివారణ .!

Next article

You may also like