Cropping Systems: ఒకే భూమి లో వివిధ పంటలను నిర్దేశించిన సమయం లో ఒక క్రమంలో సాగు చేయు విధానాలను సస్య వర్ధన వ్యవస్థలు అంటారు.
మోనో క్రాపింగ్ (ఒకే పంట సాగు పధ్ధతి): ఈ పధ్ధతి లో ఒకే పొలo లో ఒకే పంటను ప్రతి సంవత్సరం సాగు చేయబడుతుంది. ఉదా: అనంతపూర్ లో తేలిక నేలల్లో ప్రతి సంవత్సరం వేరుశెనగ వేస్తారు.
నష్టాలు: వేరు వ్యవస్థ ఒకే లోతుకు పోవడం వలన ఆ లోతు వరకే ఉన్న పోషకాలు ఉపయోగించ బడతాయి.ప్రతి సంవత్సరం అదే పంట పండించడం వల్ల చీడ పీడల సమస్య ఎక్కువ కలుపు సమస్య,ఉపాధి అవకాశాలు సరిగా లేక పోవుట,నేల కోత,ఒక ప్రత్యేక సమయం లో కూలీల ఆవశ్యకత ఎక్కువగా వుండుట,మార్కెటింగ్ సమస్యలు.
అంతర సస్య వర్ధనo (Inter Cropping): రెండు కాని అంతకన్నా ఎక్కువ పంటలను, అదే నేలలో అదే పంట కాలం లో వేర్వేరు వరుసలలో మరియు నిష్పత్తులలోపండించే విధoను అంతర సస్య వర్ధనము (inter cropping) అంటారు.
Also Read: Soil Types for Fruits Farming: పండ్ల తోటలకు అనువైన నేలలు.!
లాభాలు: సూర్య రశ్మి, తేమ, పోషకాలు వంటి వనరుల పూర్తి వినియోగo, ప్రమాణ కాలం లో ప్రమాణ విస్తీర్ణం లో ఉత్పత్తి పెరుగుదల,తెగుళ్ళు, చీడలు, కలుపు మొక్కల వల్ల తక్కువ నష్టం కొంత కాలం పాటు ఉత్పత్తి లో స్థిరత్వం సాధించ వచ్చు.అంతర సస్య వర్ధన వ్యవస్థ లో ఒక పప్పు జాతి పంటను చేర్చడం వల్ల నేల సారాన్ని పెంచవచ్చు.వివిధ పంటలు వివిధ కాలాల్లో కోతకు వస్తాయి కాబట్టి కూలీల ఆవశ్యకత సర్దుబాటు చేయవచ్చు.వాతావరణ ప్రతి కూల పరిస్థితులలో ఏదో ఒక పంట రైతుకు అంది వస్తుంది కనుక పూర్తిగా నష్ట పోడు. సాధారణంగా ఈ క్రింది సూత్రాలను ఉపయోగించి ఎన్నుకుంటారు.
· ఎత్తు గా పెరిగే పంట తక్కువ ఎత్తు పంట
· లోతుగా పోవు వేర్లు గల పంట × పై పొరల లోనే వేరు విస్తరణ జరిగే పంట
· నిటారు గా ఎదిగే పంట × గుబురు గా ఎదిగే పంట
· స్వల్పకాలిక పంట X దీర్ఘ కాలిక పంట
· ఆహార ధాన్యపు పంట X పప్పు జాతి పంట
· ఒకే కుటుంబానికి చెందిన పంటలు వేయరాదు.
ఉదా: జొన్న + కంది (2:1)
వేరుశెనగ + కంది (7:1 లేదా 5:1)
సజ్జ + కంది (2:1)
కంది + పెసర (1:1)
జొన్న + సినగ (1:1)
వేరు సెనగ + ఆముదం (7:1)
వేరుశెనగ + పొద్దు తిరుగుడు (7:1)
రిలే సస్య వర్ధనం (Relay Cropping): మొదటి పంట కోయక ముందు రెండవ పంటను మొదటి పంట వరుసల మధ్య విత్తడాన్ని / చల్లడాన్ని (రిలే సస్య వర్ధనం) అంటారు. దీనిలో తక్కువ కాలం లో ఎక్కువ పంటలు తీయడమే గాక నేల తయారీ కి అగు ఖర్చు కూడా తగ్గించవచ్చు.
ఉదా: వరి – పెసర, మినుము
కొర – జొన్న
వేరుశెనగ – జొన్న
పరి – మొక్క జొన్న
Also Read: Green Raisins Health Benefits: ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించే ఎండుద్రాక్ష.!