Palm Products: తాటిచెట్టు నుంచి నీరా, ముంజెలు , తేగలు , పండ్లు, తాటికల్లు, తాటిబెల్లం, తాటివైన్, తాటిచక్కెర, తాటితాండ్ర, తాటికోల వంటి పలు తినే పదార్ధాలు తయారు చేస్తారు. తాటిచెట్టు పుష్పగుచ్చo నుంచి తీసే నీరాను విషజ్వరాలు, వేడిని తగ్గించేందుకు వాడతారు. సువాసన , తీయగా ఉండే ఈ నిరాలో 12.6 శాతం చక్కరతో పాటు మాంసకృత్తులు , సి – విటమిన్ అధికంగా ఉంటాయి.
నీరా పులవగా వచ్చే తాటికల్లులో 5 శాతం ఆల్కహాల్ ఉంటుంది. పులవని కల్లును, పులిసిన కల్లుతో కలిపితే తాటివైన్ తయారవుతుంది. దీనికి పంచదార కలిపితే ఆల్కహాల్ శాతం పెరిగి పుల్లగా ఉంటుంది. తాటిబెల్లం రక్తహీనత వ్యాధిగ్రస్తులకు మంచిది. రక్తపోటు, గుండె, కాలేయ జబ్బులున్న వారికి మంచిది.
Also Read: Date Palm Cultivation: ఖర్జూరం సాగు ద్వారా 7 లక్షలు సంపాదిస్తున్న రైతు
తాటిచక్కెర కంటి సమస్యలున్న పిల్లలు, వృద్దులకు మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది. వంద గ్రాముల్లో 398 కేలరీల శక్తి లభిస్తుంది. తాటికొలను పాలల్లో కలిపి శితాల పానీయంగా వాడతారు. దీనిలో 11 శాతం చక్కెర ఉంటుంది. తాటిపండ్లనుంచి తీసే తాటి తాండ్రను ఇతర పండ్ల రసాలతో కలిపి మిక్సీడ్ జాములు తయారుచేస్తారు.
వేసవిలో మాత్రమే లభించే తాటిముంజెల్లో పిండి పదార్ధాలు, భాస్వరం , ఇనుము, నియాసిన్ , బి2, సి – విటమిన్లు అధికంగా ఉంటాయి. తోలు తీసిన మంజెలను మరిగించిన చక్కెర ద్రావణంలో ఉంచి 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. పాకం చల్లరక మంజెలను తీసి , పాలిబ్యాగ్ లో వేసి ఫ్రీజ్ లో నిల్వచేయాలి.
తాటి టెంకల నుంచి వచ్చే పిలకలను తాటితేగలు అంటారు. వీటిల్లో పిండి, పీచు పదార్దాలు, మాంసకృత్తులు ఎక్కువ. ఉడకపెట్టి / కాల్చుకొని తింటారు. ఉడికించిన తాటితేగాలనుంచి తీసే పిండిని మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశ, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ చేసుకోవచ్చు.
Also Read: PALM JAGGERY: ఆరోగ్యానికి తాటి బంగారం