Cotton Quality Checking – పింజ పొడవు: ప్రత్తి విత్తనం ఉపరితలం నుండి పింజ కోన వరకు ఉండే పొడవును పింజ పొడవు అంటారు.
పోగు సున్నితత్వం: ఇది వాడికే నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పోగు సున్నితత్వాన్ని సాధారణంగా ప్రమాణ పోగు పొడవుకు బరువు పరంగా వ్యక్తం చేస్తారు.
నార బలం: వంటరి పోగు మీద గాని, పోగు కట్టమీద కాని నిలువు దిశలో సాగే ప్రత్తి బలానికి గురి చేసే సాధారణంగా దీన్ని కొలుస్తారు.మిల్లీగ్రామ్ పోగు కట్టి ఒకటికి పౌoడ్లలో నిలువు బలం పరంగా విలువలను వ్యక్తం చేస్తారు.మెట్రిక్ పద్దతిలో విలువలను స్టిలోమీటర్ తో నిర్ణయించి టెక్సఒకటిని మీటర్ పోగు బరువును గ్రాములలో తెలుపుతుంది.
నార పక్వత: ఇది నార ఎంత చెందింది తెలుపు గుణం. పక్వాతను వివిధ పద్ధతుల్లో నిర్ణయిస్తారు.సామాన్యంగా అవలంభించే పద్ధతులలో నారలను 18% కాస్టిక్ సోడా ద్రావణంలో ఉబ్బేటట్లు చేసి సూక్ష్మ దర్శిని క్రింద పరిశీలిస్తారు.ఉబ్బిన నారల గోడ మందానికి (w) గోడల మధ్య వ్యాసానికి( l) నిష్పత్తి ఆధారంగా వేయాలి.
L/w = <1 పక్వం L/w =1-2 అర్ధ పక్వం L/w = >2 ఆపక్వం
Also Read: Cotton Flower Dropping: పత్తిలో పూత, పిందే రాలటం – నివారణ పద్ధతులు.!
వడికే నాణ్యత
లింట్ పత్తిని ఉపయోగించి మిల్లును దారంగా వడుకుతారు. ఆ దారాన్ని బట్టలు తయారీ చేయడానికి ఉపయోగిస్తారు.కాబట్టి ప్రత్తి ధర వడికే నాణ్యత మీద ఆధారపడుతుంది.నాణ్యతను కౌంట్ అనే ప్రమాణంలో చెప్తారు. కౌంట్ అనగా 1 పౌను నూలుతో ఎన్ని హేంకుల నూలు తయారు అవుతుంది.వడికే నాణ్యత పింజ పొడవు సున్నితత్వము బలం మీద ఆధారపడి ఉంటుంది.
ప్రత్తి రంగు: ప్రత్తి రంగు కొంచెం ఎరుపు నుంచి కాంతి వంతమైన మెరిసే తెలుపు రంగు వరకు మారుతుంది.రంగు ఎక్కువ కాంతి వంతమైన కొద్ది నాణ్యత బాగుంటుంది.ప్రయోగశాలలో రంగును నికర్స్ న్ హంటర్ కలరీమీటర్ ఉపయోగించి అంచనా చేయవచ్చు.
చెత్త ఆంటిన గింజ పత్తి
గింజ పత్తి పగిలిన కాయలనుండి తీసేటప్పుడు నీడలో అరబెట్టినప్పుడు , నిల్వ చేసినప్పుడు ఎటు వంటి చెత్త చెదారం అంటకూండ చూచినప్పుడు నాణ్యత గల ప్రత్తి వస్తుంది.వడికే నాణ్యత, నూలు అకృతి గింజ ప్రత్తి తో గల చెత్త అంశంపై ఆధారపడి ఉంటుంది.దీన్ని ప్రయోగశాలలో షేర్లీ ఎనలైజర్ ను ఉపయోగిస్తారు. ఈ పరికరం తెలిపిన ప్రత్తి మొత్తాన్ని రోలర్ ద్వారా పంపి చెత్తను లింట్ ను వేర్వేరు గా సేకరించి వాటి శతాన్ని నిర్ణయిస్తారు.
Also Read: Cotton Cultivation: ప్రత్తి పంట లో వర్షాలు తగ్గిన తర్వాత రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు