ఉద్యానశోభమన వ్యవసాయం

Banana Harvesting: అరటి గెలలను కోసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు.!

2
Banana Harvesting
Banana Harvesting

Banana Harvesting: అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానం. మన దేశంలో 4.84 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.3 మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది.. అంతేకాక జాతీయ స్థాయిలో అరటి పంట మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 18% అరటిదే. తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలో అరటి ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 4 వ స్థానంలో (154 వేల ఎకరాలు). ఉత్పాదకతలో (23 లక్ష టన్నులు) 5వ స్థానంలో ఉంది. చిత్తూరు, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాక్, కృష్ణా, శ్రీకాకుళం,వరంగల్,రంగారెడ్డి, మెదక్ జిల్లాలో అరటి ఎక్కువగా పండిస్తారు.

Banana Harvesting

Banana Harvesting

Also Read: Pseudo Stem Borer in banana: అరటి లో కాండం తొలుచు పురుగు యాజమాన్యం

గెలలను కోసిన తరువాత వెంటనే నీడలో ఉంచాలి. ఎండలో వుంచరాదు. ఎండలో ఉంచడం వలన కాయల లోపల వేడిమి పెరిగి కాయలు త్వరగా పండటం ప్రారంభిస్తాయి.

వంపు తిరిగిన పదునైన కత్తిని ఉపయోగించి 15 నుండి 20 కాయలు వుండునట్లుగా హస్తములను అరటి గెలల నుంచి వేరు చెయ్యాలి.

ఈ విధంగా వేరు చేసిన చేతులను నీటిలో వుంచి సోన పూర్తిగా కారనిచ్చి, బాగా శుభ్రపరచాలి.

కాయలను శుభ్రపరచుటకు 0.5 గ్రా.. బావిస్టన్ మందును లీటరు నీటికి కలిపినట్లయితే ఎలాంటి శిలీంధ్రములు ఆశించకుండా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.

శుభ్రపరచిన అరటి హస్తములను గాలి సోకడానికి వీలు కలిగినటువంటి ఫైబరు బోర్డు పెట్టెలలో ఉంచి ప్యాక్ చెయ్యాలి.

లేత కాయలు, బాగా పండిన కాయలను, ముదిరిన కాయలతో కలిపి నిలువ ఉంచరాదు.

కాయలను లేదా గెలలను ట్రక్కులు, రైలు పెట్టెల ద్వారా రవాణా చేయునప్పుడు ఒక క్రమ పద్ధతిలో గెలలను నిలువుగా అమర్చి, పై గెలల బరువు క్రింద ఉన్నటువంటి గెలల మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మగ్గ వేయడం, నిలువ వుంచడం:

గాలి చొరబడిన గదిలో ఉంచి పొగ సోకించి 24 గంటల సేపు ఉంచితే గెలలు పండుతాయి. కోసిన గెలలపై 1000 ppm ఇథరెల్ మందు ద్రావణం పిచికారి చేస్తే అరటి పండ్లకు ఆకర్షణీయ రంగు వస్తుంది.

పండిన అరటి గెలలను శీతలీకరణ గదులలో 15°c ఉష్ణోగ్రత వద్ద, 85-90 శాతం గాలిలో తేమ ఉండునట్లు చేసి నిలువ వుంచినట్లయితే సుమారు 3 వారముల వరకు పండ్లు చెడిపోకుండా నిలువ ఉంచాలి

అరటి పండ్లను 15°c ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిలువ చేయరాదు. ఇలా చేసినట్లయితే కాయలు నల్లబడి త్వరగా పాడవుతాయి.

దిగుబడి:

సగటున ఒక గెల 8-10 చేతులను తో 120-150 పండ్లను కల్గిండును. సగటున గెల బరువు 15-22 కేజీలుండి ఎకరానికి 14 టన్నుల దిగుబడి ఇచ్చును.

Also Read: Banana Leaf Health Benefits: అరటి ఆకు ఆరోగ్యానికి వరం.!

Leave Your Comments

Weed Management in Sugarcane: చెరకులో కలుపు యాజమాన్యం.!

Previous article

Age Determination in Cows: పాడి పశువుల వయస్సు నిర్ధారించుట.!

Next article

You may also like