వార్తలు

Analysis on Good Prices of Dried Chillies: ఈ ఏడాది ఎండుమిర్చికి మంచి ధరలకు కారణాలు ఒక విశ్లేషణ.!

2
Analysis on Good Prices of Dried Chillies
Analysis on Good Prices of Dried Chillies

Analysis on Good Prices of Dried Chillies: మసాలా దినుసుల పంటలలో మిర్చి ఒక అతి ముఖ్యమైన పంట. ఇక్కడ మిర్చికి ఉండే ప్రత్యేకమైన రుచి, ఘాటు ఇతర లక్షణాల వల్ల ప్రపంచంలోనే ఉత్పతి, ఎగుమతులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మన దేశం ఉత్పత్తి చేసే మొత్తం మసాలా దినుసులలో మిర్చి 42 శాతం ఉండగా మొత్తం ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో 43 శాతం కలిగి ఉంది. మన తరువాతి స్థానాల్లో వరుసగా చైనా,  ఇధియోసియా, థాయిలాండ్‌, పాకిస్తాన్‌ మరియు బంగ్లాదేశ్‌లు ఉన్నాయి.

Analysis on Good Prices of Dried Chillies

Analysis on Good Prices of Dried Chillies

2019`20 సంవత్సరానికి మనదేశం ఎండుమిచ్చి ఉత్పత్తి 6.66 లక్షల టన్నులు కాగా,  ఉత్పాదకత 4657 కిలోలు / హెక్టారుగా ఉంది. అలాగే 1.43 లక్షల హెక్టార్లలో సాగు విస్తీర్ణంతో ఆంధ్రప్రదేశ్‌ ముందుండగా తర్వాతి స్థానాల్లో వరుసగా తెలంగాణ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ నిలుస్తున్నాయి. మనదేశం నుండి ఎండుమిర్చి ఎగుమతి చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో వియత్నాం, ధాయిలాండ్‌, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా నిలుస్తున్నాయి.

Also Read: Chilli cultivation: మిరప పంటకు కావాల్సిన అనుకూలమైన వాతావరణం

2020`21 లో మొత్తం ఎండు మిర్చి దిగుబడి 19.88  లక్షల టన్నులుగా అంచనా వేయడం జరిగింది. అది గత సంవత్సర దిగుబడి అయిన 19.14 లక్షల టన్నుల కన్నా అధికం. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.40 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 12.55 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి.
ఎండు మిర్చి దేశీయ ఉత్పత్తి మరియు విస్తీర్ణం

2016`17 2017`18 2018`19 2019`20 2020`21
విస్తీర్ణం (హెక్టార్లు) 859790 678880 706710 623446 732213
ఉత్పత్తి (టన్నులు) 2411150 1718200 1515560 1841800 1988304

ఎండు మిర్చి ఎగుమతుల వివరాలు

2016`17 2017`18 2018`19 2019`20 2020`21
పరిమాణం (టన్నులు) 400250 443900 468500 496000 649815
విలువ (రూ. లక్షలు) 507075 425632 541117 671039 924126

2021 నుండి 22 వానాకాలం మిర్చి పంటకు ముందస్తు మార్కెట్‌ ధరల సూచన ప్రకారం క్వింటాలుకు కేవలం రూ 11,500`13,500 మాత్రమే సూచించగా వాస్తవంగా అంత కన్నా చాలా ఎక్కువ సగటు మార్కెట్‌ ధర పలకడం జరిగింది. దేశీయంగా సింగిల్‌ పటి,్ట తేజ, వండర్‌ హాట్‌, యుఎస్‌ 341 మరియు దేశీయ రకం మిర్చిలకు అధిక డిమాండ్‌ ఉండటం జరిగింది. ఇక ఎండుమిర్చి వరుసగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ మొదలైనవి.

వరంగల్‌ మార్కెట్లో 2017 సంవత్సరంలో  క్వింటాలు కనిష్టంగా రూ 3000 ఉండగా ఇప్పుడు అదే మార్కెట్లో క్వింటాలుకు రూ 55 వేల వరకు పలకడం జరిగింది.

 Chili Crop

Chili Crop

తెలుగు రాష్ట్రాల్లో ఎండుమిర్చి అధిక ధరలకు కారణాలు:
. స్థూల ఉత్పత్తి తగ్గిపోవడం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎండు మిర్చి దిగుబడి పెరిగినప్పటికీ ఎక్కువ శాతం ప్రాంతాల్లో దిగుబడి సంఘటన జరిగింది అందువల్ల ధరలు పెరగడం జరిగింది.
.  2021 నుండి 22 లో చైనా నుండి కొనుగోళ్ళు అధికమవుతాయి అనే ఊహాగానాలు మరో ప్రధాన కారణం.
.  తేమ శాతం పెరగడం వలన కొన్ని రకాల ఎడల వ్యక్తి అధికమవడం జరిగింది.
.  2022 ఏప్రిల్‌ మాసం మొదటి పక్షంలో వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు ధర పలకడం జరిగింది. దీనికి కారణం సింగల్‌ పట్టి, తేజ వండర్‌ హాట్‌,  యు.ఎస్‌ 341 వంటి విదేశాలకు ఎగుమతి చేసే రకాలు తక్కువ పరిమాణంలో మార్కెట్‌కి చేరుకోవడం.
. ఇక అన్ని రకాలలోకెల్లా సింగిల్‌ పట్టి రకానికి అధిక ధరలు లభించడం జరిగింది దీనికి విదేశాలతోపాటు దేశీయంగా కూడా ఊరగాయల తయారీలో, కారంపొడి తయారీలో విరివిగా ఉపయోగించడం కారణం.

రైతులు నిజంగా లాభపడ్డారా?
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలో కొంత దిగుబడులు పడిపోయాయి అయినప్పటికీ తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ధరలు విపరీతంగా పెరిగాయి. కాకపోతే ఈ పెరుగుదల చాలా స్వల్పకాలమే కొనసాగింది. ఎనమాముల మార్కెట్‌ యొక్క అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడు మార్కెట్‌ ఆదాయ లక్ష్యం రూ. 28.30 కోట్లు కాగా రూ. 33.63  కోట్లు రావడం జరిగింది.

అయితే రైతాంగ విషయానికొస్తే కేవలం కొంత కాలమే అధిక ధరలు ఉండడం వలన కొంత లాభం పొందినప్పటికీ పెరిగిన పెట్టుబడి ఖర్చులు అధికం పురుగు మందు ధరలు ఎరువుల ధరలు కూలీల ఖర్చు మొదలైనవి నేపథ్యంలో నికరంగా మిగిలిన లాభం స్వల్పమే పైగా ఈ పెరిగిన ధరలు అందరికీ అందలేదు ఎక్కువ మంది రైతులు సరాసరి పెరిగిన ధరలు పొందలేదు అంతే కాకుండా మార్కెట్లో క్వింటాలుకు అధిక ధరలు ఉన్నప్పటికీ ఈ ఏడాది సరాసరి దిగుబడులు తగ్గడం కూడా రైతుల లాభదాయకంగా మారింది.

ఈ పంట సాగు కోసం సగటున ఎకరాకు రూ. 70 వేల నుండి లక్ష రూపాయల వరకు ఖర్చు చేసిన వారు దిగుబడులు అధికంగా పొంది అధిక  మార్కెట్‌ ధర సాధించినప్పటికీ వారి ఆదాయాలు మళ్ళీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయి.
ముగింపు

ఈ ఏడాది ఎండు మిర్చి పంట విస్తీర్ణం పెరిగినప్పటికీ అధిక ధరలు రావడానికి కారణం దిగుబడులు తగ్గటమే అంతర్జాతీయంగా డిమాండ్‌ పెరగడం చైనా నుండి మరింత పెరిగే అవకాశం ఉందని ఊహాగానాల వల్ల స్థానికంగా అధిక ధరలు పలకడం జరిగింది దీని వల్ల రైతులకు అధిక మార్కెట్‌ ధర లభించినప్పటికీ పెరిగిన సాగు ఖర్చుల నేపథ్యంలో నికర లాభాలు మాత్రం అంతగా పెరగలేదు కాబట్టి రైతులకు లాభం మరియు క్షేమం శాశ్వతం కావాలంటే గిట్టుబాటు ధర అందించడానికి తగిన సంస్థాగత ఏర్పాట్లతో పాటు సాగు ఖర్చు తగ్గించడానికి వివిధ రకాల మద్దతు చర్యలు అలాగే ఎండుమిర్చి లాభదాయకత ప్రధాన ఆటంకం అయినటువంటి చీడపీడల నివారణకు కావలసిన రక్షక రూపొందించి క్షేత్రస్థాయిలో ప్రచారం కల్పించి అమలు చేయడం ద్వారా రైతుల సంక్షేమం కోసం తోడ్పడవచ్చు.

Also Read: Seed Cleaning in Chili Crop: మిరపలో విత్తనశుద్ధి – నారుమడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు

Leave Your Comments

Procedures for Fish Storing: చేపలను పట్టుబడి చేసిన తరువాత నిల్వ చేయు విధానాలు.!

Previous article

Weed Menace in Agriculture: కలుపు ముప్పా లేదా మేలా ?

Next article

You may also like