Corn Oil Health Benefits: ఇతర కూరగాయల నూనెలతో పోలిస్తే , మొక్కజొన్న నూనె తక్కువ ధర మరియు దాని సెమీ న్యూట్రల్ రుచి వలన దీనిని వంట నూనెగా ప్రజలు సాధారణంగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఉండగా మరి కొందరు వ్యక్తులు ఆర్గానిక్ కార్న్ ఆయిల్‌ను ఔషధ లేదా మసాజ్ ఆయిల్‌గా కూడా వాడుతున్నారు. ఈ నూనె యొక్క నాణ్యత, మరియు దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ముఖ్యంగా దీన్ని ప్రాసెసింగ్ చేసె పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా శుద్ధి చేయని, సేంద్రీయ నూనె అందించే కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం!
1)కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంలో ఉంచుతుంది: మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ వంటి రెండు రకాల కొవ్వులు శరీరానికి చాలా అవసరం. ఎందుకనగా ఇవి వాపు మరియు అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి తోడ్పడుతాయి.కానీ ఇవే కొవ్వులు చాలా ఇతర రకాల మొక్కజొన్న నూనెలో, ముఖ్యంగా శుద్ధి చేసిన రకాల్లో సరైన సమతుల్యంలో లభించవు. ఇందుమూలాన ఈ నూనె రక్తపోటును మరియు కొలెస్ట్రాల్‌ను చాలా తక్కువ పరిమాణంలో సమతుల్యం చేయగలదు కాబట్టి వంటకాలలో ఈ నూనెను చాలా తక్కువగా ఉపయోగించాలి.
Also Read: Olive Oil Benefits: అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే వంట నూనె!
2)వాపును తగ్గించడానికి తోడ్పడుతుంది: ఈ నూనెను సరైన మొతాదులో తీసుకోవడం వలన ఇందులో ఉండే ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫ్యాటీ ఆమ్లాలు వాపులు రాకుండా వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే కీళ్లనొప్పులు, అలాగే తలనొప్పి, జీర్ణశయాంతర సమస్యలు మరియు చర్మ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.
3)కంటి చూపును మెరుగుపరుస్తుంది: మొక్కజొన్న నూనెలో ఫ్లేవనాయిడ్లతో పాటుగా లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి. ప్రత్యేకంగా, లుటీన్ కంటి ఆరోగ్యాన్ని మరియు దృష్టిని పెంపొందిస్తుంది మరియు క్యాటరాక్ట్ వంటి వ్యాధులను అభివృద్ధి చెందకుండా నిరోధిస్తుంది.
4)దీర్ఘకాలిక వ్యాధులకు చెక్: ఇందులో లభించే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, ఫ్లేవనాయిడ్లు మరియు విటమిన్ ఇ వంటి అన్నింటికీ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.ఇవి శరీరంలోని ఆక్సిడేటీవ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ నూనెను సరైన పరిమాణంలో తీసుకోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఇంకా చర్మాన్ని తాజాగా యవ్వనంగా మార్చడంలో తోడ్పడుతుంది.
Also Read: Coconut Milk Health Benefits: వైరల్ ఇన్ఫెక్షన్లన్నీ తగ్గించే కొబ్బరి పాలు