PM Ujjwala Yojana: హోలీ పండుగ అంటే ఇష్టపడని వారుండరు. రంగులతో ఊరువాడా అంత నిండిపోతుంది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా జరుపుకుంటారు. అయితే హోలీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు హోలీ సందర్భంగా ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఆహార, పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. నిజానికి ఉజ్వల పథకం లబ్ధిదారులకు హోలీ, దీపావళి రోజుల్లో ఉచితంగా సిలిండర్లు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఉజ్వల పథకం ద్వారా 1.65 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వీరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేయాలంటే ప్రభుత్వం రూ. 3000 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన అనేది దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలకు LPG కనెక్షన్‌లను అందించే పథకం. ఈ మేరకు ఆహార, పౌరసరఫరాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ నుంచి బడ్జెట్ విడుదల చేసి సిలిండర్లు పంపిణీ చేయనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మార్చి వరకు వర్తించే ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించబోతోంది. దీని కింద జాతీయ ఆహార భద్రత కింద లభించే గోధుమలు, బియ్యం, గ్రాములు, ఉప్పు, నూనె ఉచితంగా అందజేస్తున్నారు.
Also Read: నీటి చెస్ట్‌నట్‌లు, ఔషధ మొక్కల సాగుకు చేయూత
కాగా ఉజ్వల పథకం కింద రెండు సిలిండర్లు, ఉచిత రేషన్ ఇచ్చే పథకాన్ని ముందుకు తీసుకెళ్తామని ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 4 రాష్ట్రాల్లో అద్భుత విజయాన్ని అందుకుంది. అదే సమయంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీ పునరాగమనం చేసి మళ్లీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
Also Read: 2023వ సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్ గా ప్రకటన